Site icon HashtagU Telugu

AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్‌

ap-govt-decided-to-posting-to-ab-venkateswara rao

ap-govt-decided-to-posting-to-ab-venkateswara rao

AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, మూడ వారల క్రితం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మ‌రి కాసేప‌ట్లోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌నుంది.

Read Also: Super Star Krishna : చాలా మిస్ అవుతున్నా నాన్న – మహేష్ ఎమోషనల్ ట్వీట్