మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ వినుకొండ పర్యటనకు (YS Jagan Vinukonda Tour) అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని , ఓ తుప్పుపట్టిన వాహనం జగన్ కు ఇచ్చారని..ఇదేనా మాజీ సీఎం కు మీరు ఇచ్చే గౌరవం అంటూ ప్రభుత్వం ఫై మాజీ మంత్రి అంబటి రాంబాబు (EX Minister Ambati Rambabu) విరుచుకపడ్డారు. ‘ఉద్దేశపూర్వకంగానే జగన్కు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు. ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ వెంట జనం ఉన్నారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈయన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించింది. జగన్ కు భద్రత తగ్గించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. కండిషన్ లో లేని వాహనాలు ఇచ్చారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జగన్ కు కేటాయించిన జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఎలాంటి లోపం లేదని ఉద్ఘాటించింది. జగన్ కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్ నెస్ తోనే ఉందని అధికారులు వెల్లడించారు. జగన్ దిగిన తర్వాత ఆ వాహనం కాన్వాయ్ లోనే వెళ్లిందని వివరించారు. ఇక, జగన్ కాన్వాయ్ వెంట వచ్చిన వాహనాలను నిలిపివేశామనడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది.
Read Also : Dog Bite : హైదరాబాద్ లో 10 ఏళ్లలో కుక్క కాటు కేసులు ఎన్నో తెలుసా..?