Site icon HashtagU Telugu

AP Govt : గ్రామ, సచివాలయ ఉద్యోగులకు కూటమి సర్కార్‌ షాక్‌

Ap Govt Big Shock To Secret

Ap Govt Big Shock To Secret

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు (Secretariat Employees) షాక్ ఇచ్చింది. సచివాలయాలను మూడు కేటగిరీలుగా (ఏ, బీ, సీ) విభజించి, ప్రతి కేటగిరీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..ఏ కేటగిరీ సచివాలయంలో ఆరు మంది, బీ కేటగిరీలో ఏడుగురు, సీ కేటగిరీలో ఎనిమిది మంది మాత్రమే పనిచేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్‌ వెనక్కి

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి పచ్చజెండా ఊపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరిగిన సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. కనీసం 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం ఉండేలా చర్యలు చేపట్టడం కూడా దీనిలో భాగమని ప్రభుత్వం పేర్కొంది.

ఉద్యోగులను మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, టెక్నికల్‌ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్‌ సెక్రటరీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విభజన వల్ల ఉద్యోగుల పనిభారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విధానం వల్ల దాదాపు 40,000 ఉద్యోగాలు తగ్గిపోతాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల కుదింపు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు ఇది అన్యాయం చేస్తుందని, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో సమస్యలు ఏర్పడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మరి నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఏంజరుగుతుందో చూడాలి.