ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం..ఏడాది పాటు పొగాకు, గుట్కా పై నిషేధం

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఏడాది పాటు పొగాకు,గుట్కా, పాన్ మ‌సాల నిషేధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - December 7, 2021 / 10:37 AM IST

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి ఏడాది పాటు పొగాకు,గుట్కా, పాన్ మ‌సాల నిషేధిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిషేధం నేటి నుంచి అమ‌ల్లోకి రానుంది. నికోటిన్‌తో కూడిన ఆహార ఉత్పత్తులైన గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గుట్కా, పాన్ మసాలా దినుసులను ఎవరైనా ఏ పేరుతో తయారు చేసినా, విక్రయించినా, సరఫరా చేసినా, నిల్వ చేసినా నేరంగా ప‌రిగ‌ణిస్తామ‌ని ఉత్త‌ర్వుల్లో వెల్ల‌డించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని…. వీటిపై ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ గుట్కా, పాన్ మసాలాపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రంలో గుట్కా నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని కొట్టివేస్తూ తీర్పునిస్తూ కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది