TTD EO Syamala Rao: టీటీడీ ఈవోగా శ్యామలరావు.. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అనుభవం..!

  • Written By:
  • Updated On - June 15, 2024 / 11:09 AM IST

TTD EO Syamala Rao: ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ J. శ్యామలరావును కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO Syamala Rao)గా నియమించారు. గతంలో టీటీడీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సెలవు మీద వెళ్లటంతో కొత్త ఈవోని నియమించారు.

శ్యామలరావు.. ఆరోగ్యం, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మరియు ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్‌తో సహా వివిధ విభాగాలలో విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. గతంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ధర్మారెడ్డి సెలవుపై వెళ్లడంతో కొత్త ఈఓ నియామకం జరిగింది. రాబోయే వారాల్లో దేవస్థానంలోని అత్యున్నత పరిపాలనా స్థానాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని టీటీడీ ట్రస్ట్‌లోని వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: Allu Arjun : అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేసిన సాయి ధరమ్ తేజ్.. నిహారిక కామెంట్స్ ఏంటి?

టీటీడీలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు పరిశీలనలో ఉన్న తరుణంలో నాయకత్వ మార్పు కీలకంగా మారింది. ఔట్‌గోయింగ్ అడ్మినిస్ట్రేషన్ పదవీకాలంలో జరిగిన అవకతవకలపై విచారణ గురించి ఊహాగానాలు విస్తృతంగా ఊపందుకున్నాయి. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన వివిధ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ చేపట్టాలని టీడీపీ బాస్ చంద్రబాబు సూచించారు. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత పాలనలో అవినీతి, దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పవిత్రమైన తిరుమల ఆలయంలో “పరిపాలనను శుద్ధి” చేస్తామని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp : Click to Join

శ్యామలారావు గురించి

తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు. ఆయన స్థానంలో J. శ్యామలారావును నియమించారు. 1997 బ్యాచ్ IAS అధికారి అయిన శ్యామలారావు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్‌గా, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం, పౌరసరఫరాలు, హోం శాఖల్లోనూ అనుభవం ఉంది.