AP Literacy: విద్య‌తోనే పేద‌రికాన్ని నిర్మూలించాలి – సీఎం జ‌గ‌న్‌

రాష్ట్రంలో 100% అక్షరాస్యత మాత్రమే కాకుండా 100% గ్రాడ్యుయేషన్ రేటు కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు.

  • Written By:
  • Updated On - December 1, 2021 / 04:19 PM IST

విజయవాడ: రాష్ట్రంలో 100% అక్షరాస్యత మాత్రమే కాకుండా 100% గ్రాడ్యుయేషన్ రేటు కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. ల‌క్ష్యాన్ని చేరుకోవడానికి జగనన్న విద్యా దీవెన పథకం మొదటి అడుగు అని సీఎం తెలిపారు. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే విద్యా దీవెన మూడో విడతగా రూ.686 కోట్లను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించి, సాధికారత సాధించగలమన్నారు.

విద్యా దీవెన లబ్ధిదారులకు చెందిన 9,87,965 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని నేరుగా జమ చేశారు. 2019 నుండి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ. 6,259 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గత పాలనలో రూ. 1,778 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మొత్తం 21,48,477 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.
విద్యతోనే ఒకరి భవితవ్యం మారుతుందని సీఎం జ‌గ‌న్ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుండి వైద్యులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులు ఉద్భవించేలా చూడాలనుకుంటున్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఇదే లక్ష్యంతో దివంగ‌త నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా… ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానిని నీరుగార్చాయ‌ని ఆయ‌న ఆరోపించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

నెల్లూరులో తన ప్రజా సంకల్ప యాత్రలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని తల్లిదండ్రులు తన వద్దకు వెళ్లిన స‌మ‌యంలో విద్యార్థి త‌ల్లిదండ్రులు చెప్పిన మాట‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకున్నారు. క‌ళాశాలో బకాయిలు తీర్చాలంటూ వచ్చిన ఒత్తిడి వల్లే తాము తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చిందని ఆ త‌ల్లిదండ్రులు చెప్పిన‌ర‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇది ఆయ‌న్ని తీవ్రంగా క‌దిలించింద‌ని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని తాను నిర్ణయించుకున్నానని జ‌గ‌న్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరించామ‌ని ఆయ‌న తెలిపారు.

విద్యా దీవెన లబ్ధిదారులు తప్పనిసరిగా 7-10 రోజుల్లోగా ఫీజు చెల్లించాలని ముఖ్యమంత్రి కోరారు. లబ్ధిదారులు సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే ప్రభుత్వమే నేరుగా కళాశాల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని బదిలీ చేస్తుందని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యంతో లేదా విద్యా దీవెనతో ఏదైనా సమస్య తలెత్తితే, లబ్ధిదారులు టోల్ ఫ్రీ నంబర్ 1902లో అధికారులను సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన మెరిట్ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం మీద, 2,118 మంది ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఇప్పుడు విద్యా దీవెన కింద మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనాన్ని పొందుతున్నారు. కళాశాలల్లో 17-23 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి APలో 35.2%కి పెరిగిందని, జాతీయ వృద్ధి 3.04%కి వ్యతిరేకంగా 8.6% వృద్ధిని నమోదు చేసిందని అఖిల భారత ఉన్నత విద్యా సర్వే వెల్లడించింది. జాతీయ వృద్ధిరేటు 1.7%, 4.5% మరియు 2.27% ఉండగా, APలో SC, STలు మరియు బాలికల GER వరుసగా 7.5%, 9.5% మరియు 11.03% పెరిగిందని ఆయన వెల్లడించారు.జగనన్న విద్యా దీవెన పథకంలో మూడో విడతగా రూ.686 కోట్లు విడుదల చేసి రాష్ట్రంలోని 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చారు.