Sajjala : హైదరాబాదులో చంద్రబాబుని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమే – స‌జ్జ‌ల‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జైలు నుంచి విడుద‌లైన త‌ర‌వుత జ‌రిగిన ర్యాలీల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల

  • Written By:
  • Updated On - November 2, 2023 / 05:48 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జైలు నుంచి విడుద‌లైన త‌ర‌వుత జ‌రిగిన ర్యాలీల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబుని చూసేందుకు వ‌చ్చింది ప‌చ్చ బ్యాచ్ అంటూ వ్యాఖ్య‌లు చేశారు.హైదరాబాదులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉంటుందన్నారు. అనారోగ్యం బాగాలేదని చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే టీడీపీ నాయ‌కులు హ‌డావిడి చేస్తున్నారని తెలిపారు. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చని.. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా..? అని సజ్జ‌ల ప్ర‌శ్నించారు. చంద్రబాబునాయుడుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉంది.పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృశ్య రోడ్లు గురించి మాట్లాడుతున్నార‌ని.. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామంలో ఉన్న ఏడు మండలాల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారని.. ఈ మండలాల్లో ప్రజలు ఎందుకు వ‌స్తామంటున్నారు కేసీఆర్ గ్రహించాలన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి ఏపీలోకి వస్తున్నామని 7 మండలాల ప్రజలు చెబుతున్నారని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుందని.. ఏపిలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారు.. అని తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కెసిఆర్ వ్యాఖ్యలు చేశారని స‌జ్జ‌ల గుర్తు చేశారు. ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలలో పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు.

Also Read:  Tummala : తెలంగాణ‌లో టీడీపీ అభిమానులు వివేకంతో ఓటేయాలి – ఖమ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల‌