Site icon HashtagU Telugu

AP Governor Speech : ఏపీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది – గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

Ap Governor

Ap Governor

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ భిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఉభ‌య స‌భల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. 2020-21 నుంచి నాడు-నేడు పనుల కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. వికేంద్రీకృత, సమ్మిళిత ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం గత మూడేళ్లుగా కృషి చేస్తోందన్నారు. అమ్మ ఒడి పథకం కింద రూ.13,023 కోట్లు ఖర్చు చేశామ‌ని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదలు మరియు బలహీన వర్గాలకు సహాయం అందించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2020-21 సంవత్సరంలో 16.82 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసిందని.. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభమవుతుందని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించామని చెప్పారు.

గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. మన బడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేశామ‌ని.. తొలి దశలలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలలను అభివృద్ధి చేశామ‌న్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.13,023 కోట్లు అందజేశామ‌ని.. జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామ‌న్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రతిపాదించామ‌ని.. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13, 500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని.. ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు రూ.20,162 కోట్ల సాయం అందింద‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18.55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింద‌ని…2021-22లో రూ.9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోజనం చేకూర్చా\మ‌న్నారు.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,04,758 గా ఉందన్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్లు అందించాంమ‌ని.. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ డ్రైవర్లకు సాయం అందిస్తున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కోన్నారు. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులకు రూ.583 కోట్లు సాయం అందించామ‌ని… 2.7 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.770 కోట్ల సాయం చేశామ‌న్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్ల సాయం ..వైఎస్ఆర్ ఆసరా కింద 78.75 లక్షల మందికి సాయం, స్వయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు అందించామ‌న్నారు. వైఎస్ఆర్‌ కాపు నేస్తం కింద ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.75వేల చొప్పున కాపు నేస్తం కింద ఇప్పటి వరకు రూ.981.88 కోట్లు అందించామ‌న్నారు. ఈబీసీ నేస్తం కింద ఏడాదికి అర్హులైన ఒక్కొక్కరికీ రూ.15వేల సాయం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.577 కోట్ల సాయం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ.2,354 కోట్లు అందించామ‌న్నారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి కోసం రూ.6,400 కోట్లు వ్యయంతో 3 వేల కి.మీ పొడవైన 2 లైన్ల రోడ్లను అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడ‌ని.. 2023 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులుపూర్తి చేస్తామ‌న్నారు.

మరోవైపు టీడీపీ నేతల నిరసనల మధ్య గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి గాల్లోకి విసిరేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం ప్రారంభం కాగానే టీడీపీ నేతలు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు. రాజ్యాంగ వ్యవస్థను రక్షించడం లేదంటూ గో బ్యాక్‌ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి సభలో నిరసన తెలిపిన టీడీపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వారు సభ నుంచి వాకౌట్ చేశారు.