Site icon HashtagU Telugu

Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత

Ap Governor

Ap Governor

కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్ తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జలుబు, దగ్గు లక్షణాలతో ఇబ్బందిపడ్డ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ కు ‌‌ ఈ నెల 15న పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్టు తేలింది. దీంతో 17న అత్యవసరంగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో 23న డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆసుపత్రిని సంప్రదించాయి.

గవర్నర్‌కు అదనపు చికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు.