Site icon HashtagU Telugu

Volunteer Awards : ఏపీ వాలంటీర్ల అవార్డుల పేర్లు తెలుసా? ఒక్కో అవార్డుకు ఎంత అమౌంట్ ఇస్తారో తెలుసా?

AP Government Volunteer Awards names and amount details

AP Government Volunteer Awards names and amount details

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రభుత్వ పనులు జరగడానికి వాలంటీర్ల సిస్టమ్ ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లుగా(Volunteers) అత్యుత్తమ సేవ చేస్తున్న పలువురికి ప్రతి సంవత్సరం అవార్డుతో పాటు కొంత నగదు కూడా బహుకరిస్తున్నారు.

తాజాగా ఆ వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జరపనుంది. వరసగా మూడో ఏడాది… ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఇవ్వనున్నారు. నేడు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

మే 19వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులను ఇవ్వనున్నారు. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో ఈ పురస్కారాలు ఇస్తున్నారు.

ఈ అవార్డుల్లో మొదటిది సేవా వజ్ర – దీనికి సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలను ఇవ్వబోతున్నారు.

రెండు అవార్డు సేవా రత్న – సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌ 1 శాతం ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాలను ఇవ్వబోతున్నారు.

మూడవ అవార్డు సేవా మిత్ర – సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాల ప్రధానం ఇవ్వబోతున్నారు. దీనిపై వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read :  KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్, జన సైనికులపై KA పాల్ సంచలన కామెంట్స్..