Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?

ఏపీ ప్రభుత్వం తాజాగా ముస్లింలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 06:45 PM IST

ఏపీ ప్రభుత్వం తాజాగా ముస్లింలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం దుల్హన్ పథకం విషయంలో చేతులెత్తేసింది. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నామని గా హైకోర్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. నిరుపేద ముస్లిం మైనారిటీ యువతులకు వివాహ సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని నిలిపివేస్తున్నామని ఏపీ హైకోర్టుకు తాజాగా జగన్ సర్కార్ తెలిపింది. అయితే ఈ దుల్హన్ పథకాన్ని ఆపివేయడానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు అని తెలుస్తోంది.

ఇకపోతే అప్పట్లో టిడిపి ప్రభుత్వం ముస్లిం యువతుల వివాహానికి 50 వేలు ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని పెంచుతూ ఆర్థిక సహాయాన్ని లక్షకు పెంచుతామని గతంలో ఎన్నికలలో జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ విస్మరించింది అని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.

వైసిపి ప్రభుత్వం స్కీమ్ అమలు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ లాయరు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అఫిడవిట్ల పై దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి కోర్టు ఆదేశాలను జారీ చేసింది.