Site icon HashtagU Telugu

Aadhaar Camps: ఆధార్ అప్‌డేట్ కోసం ‘ఏపీ ప్రభుత్వం’ ప్రత్యేక క్యాంపులు!

Aadhaar Card

Aadhaar Card

ఆధార్ (Aadhaar Card) కార్డుల్లో బయోమెట్రిక్ అప్‌డేట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గురువారం నుంచి ఐదు రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. జనవరి 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, పాఠశాలల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు నాలుగు రోజుల పాటు మరోసారి ఈ శిబిరాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఇప్పటి వరకు తమ ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ (Aadhaar Card) అప్‌డేట్ చేసుకోలేదు.

ప్రత్యేక శిబిరాల గురించి జిల్లా కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌చార్జి అధికారులకు, జిల్లా విద్యాశాఖకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సగిలి షణ్మోహన్ సలహా ఇచ్చారు. శిబిరాల గురించి ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రత్యేక శిబిరాల రోజుల్లో సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవలపైనే (Aadhaar Card) దృష్టి సారిస్తారు. ఆధార్ కార్డు జారీ చేసే అధికారం, UIDAI, కార్డ్-హోల్డర్ల బయోమెట్రిక్ వివరాలను నవీకరించడానికి ఇటీవల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇది కనీసం 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి.

రాష్ట్రంలో (AP) ఇప్పటి వరకు 80 లక్షల మంది తమ కార్డులను అప్‌డేట్ చేసుకోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ (Govt Benefits) ఆధార్ అనుసంధానంతోనే అమలవుతున్నాయి. నవరత్నాలు పేరుతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలను ఆధార్ బయోమెట్రిక్ విధానంతో అనుసంధానం చేశారు. ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు, ప్రభుత్వ ప్రయోజనాలను అందించడానికి వాలంటీర్లు బయోమెట్రిక్‌లను తీసుకుంటున్నారు.

Also Read: Chiranjeevi Demands: భోళా శంకర్‌ కు ‘చిరంజీవి’ కండీషన్స్