Site icon HashtagU Telugu

Andhra Pradesh: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు నో ఎంట్రీ

cm jagan

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులెవరూ కార్యాలయాల్లోకి ప్రవేశించకూడదని జగన్ సర్కారు ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ రామకృష్ణ నివేదిక జారీ చేశారు.

అనధికారిక వ్యక్తుల వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక అందించింది నేపథ్యంలోనే వీరి ప్రవేశంపై నిషేధం విధించారు. తమ ఆదేశాలను కాదని కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము సీజ్ చేసిన, లెక్కల్లోకి రాని నగదు స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని ఏసీబీ తెలిపింది.

Exit mobile version