Site icon HashtagU Telugu

AP Pension : పింఛన్ పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..!

AP government new decision on pension distribution..!

AP government new decision on pension distribution..!

AP Pension : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుటికప్పుడు పెన్షన్ దారులకు శుభవార్తలు చెబుతుంది. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పెన్షన్ దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సన్నహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈ సారి డిసెంబర్ 31న పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందజేస్తుండగా, ఈసారి నూతన సంవత్సర దినోత్సవం నేపథ్యంలో ముందుగా డిసెంబర్ 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

నూతన సంవత్సర పండుగకు ముందు డబ్బులు పంపిణీ చేస్తే.. అది పింఛన్ పొందేవారికి “న్యూ ఇయర్ గిఫ్ట్” లా భావించవచ్చు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, దీనిని అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు డిసెంబర్ 30న పింఛన్ ప్రభుత్వ ఖాతాకు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం నేతలు ఈ నిర్ణయం తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు సమాచారం.

ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రతి నెలా 1న ఏదో ఒక జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో చంద్రబాబు దివ్యాంగుల పింఛన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల పింఛన్లు తీసుకోకపోయిన వారు మూడో నెలలో వాటిని పొందగలుగుతారు. అంతేకాక తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.

Read Also: Ambati Rambabu Tweet: అంబ‌టి రాంబాబు ట్వీట్‌.. ఇంత మీనింగ్ ఉందా?