AP Govt Key Decision: ఉపాధ్యాయులకు అలర్ట్….ఒక్క నిమిషం ఆలస్యమైన అంతే..!!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన ఏవిధంగా ఉందో...ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది

  • Written By:
  • Updated On - August 15, 2022 / 10:56 AM IST

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన ఏవిధంగా ఉందో…ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది. ఏపీలో ఉపాధ్యాయులకు రేపటి నుంచి ఈ కొత్త హాజరు విధానం రాబోతోంది. ఇప్పటివరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ ను విద్యాశాఖ తీసుకువచ్చింది. దీనికోసం సిమ్స్ ఏపీ అనే మొబైల్ యాప్ ను కూడా రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే వారందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్ తో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నమోదు చేయాలి. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయనే విషయాన్ని కూడా అందులో నమోదు చేయాలి.

తర్వాత వారి ఫొటోలను మూడు యాంగిల్స్ లోనూ తీసి యాప్ లో ఆప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్ లో లాగిన్ అయి ఫోటొ తీసుకుని అప్ లోడ్ చేయాలి. అది కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆరోజు అబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టుకోవాలని యాప్ సూచిస్తుంది. ఇక ఎక్కడున్నా తొమ్మిది గంటలలోపు ఫొటో తీసుకుని అప్ లోడ్ చేస్తామంటే అస్సలు కుదరదు. GPSఆధారంగా ప్రతిపాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులు కచ్చితంగా తొమ్మిది గంటలలోపు పాఠశాలలో ఉండాల్సిందే.