Site icon HashtagU Telugu

TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

Chandrababu Quash Petition

Chandrababu Quash Petition

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసులో తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందులో చంద్ర‌బాబు ప్రమేయానికి సంబంధించి తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించార‌ని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ విషయాన్ని విచారిస్తున్నాయని.. ఈ కేసు గురించి GST డిపార్ట్‌మెంట్ మొదటగా తెలియజేసిందని తెలిపింది. మ‌రోవైపు చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు అక్టోబ‌ర్ 3వ‌ర‌కు వాయిదా వేసింది. ఇప్ప‌టికే 20 రోజుల పాటు ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు చంద్ర‌బాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇటు బెయిల్ పిటిష‌న్‌, క‌స్ట‌డీ పిటిష‌న్‌లు విచార‌ణలో ఉన్నాయి

Exit mobile version