4 Percent Reservation : ఏపీపీఎస్సీ జాబ్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్

4 Percent Reservation : ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు.

  • Written By:
  • Updated On - October 27, 2023 / 10:58 AM IST

4 Percent Reservation : ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ నెంబర్ 77ను విడుదల చేసింది.  రిజర్వేషన్ పొందనున్న దివ్యాంగుల విభాగంలో చెవిటి వారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగులను చేర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈ రిజర్వేషన్‌‌కు లబ్ధిదారుల ఎంపిక కోసం కొన్ని నియమ నిబంధనలను పొందుపరిచారు. ఉద్యోగాలకు తగిన అర్హతలతో పాటు 100 శాతం దివ్యాంగులకు ఈ జాబ్స్ ఇస్తారు. ఇందుకు అర్హులైన దివ్యాంగులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా తమ వివరాలను(4 Percent Reservation) రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Also Read: Lunar Eclipse 2023 in India : 9 ఏళ్ల తర్వాత పాక్షిక చంద్రగ్రహణం..దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..!

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో జాబ్స్ 

విజయవాడలోని ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.