AP Employees: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగుల బదిలీ అంశంపై ఉద్యోగులు ఎదురు తిరగడంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. దీంతో ఉద్యోగుల బదిలీ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలలోకి వెళితే..
ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బదిలీలను సెప్టెంబర్ 15 వరకు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. మెజారిటీ శాఖల్లో బదిలీలకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్‌లు, రెవెన్యూ, రోడ్లు & భవనాలు (R&B), మరియు రవాణా శాఖలలో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో బదిలీలపై నిషేధం మరో 15 రోజులవరకు ఎత్తివేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
వాస్తవానికి ప్రతి ఏడాది మే నెలలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. అయితే ఈసారి ఏపీలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఉద్యోగుల బదిలీ వాయిదాపడింది. కాగా బదిలీ మార్గదర్శకాలను ఏర్పాటు చేయడంలో సంబంధిత అధికారులు అదే పనిలో ఉన్నారు. అన్ని శాఖలలో బదిలీ విధానం న్యాయబద్ధంగా మరియు సమర్ధవంతంగా అమలు చేసేలా ముందుకెళ్తున్నారు. విధానపరమైన గందరగోళాన్ని పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Pawan-Bunny : పవన్ కళ్యాణ్..అల్లు అర్జున్ పై ఆ వ్యాఖ్యలు అనలేదు – నిర్మాత క్లారిటీ