YS Jagan : జ‌గ‌న్ దెబ్బ‌కు తోక‌ముడిచిన ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు!

ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు తోక‌ముడిచారు. సీపీఎస్ ర‌ద్దుపై నిర్వ‌హించాల‌నుకున్న `మిలియ‌న్ మార్చ్` శాశ్వ‌తంగా వాయిదా ప‌డింది.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 12:10 PM IST

ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు తోక‌ముడిచారు. సీపీఎస్ ర‌ద్దుపై నిర్వ‌హించాల‌నుకున్న `మిలియ‌న్ మార్చ్` శాశ్వ‌తంగా వాయిదా ప‌డింది. సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన జ‌ర‌గాల్సిన మిలియ‌న్ మార్చ్ ను ఆపేందుకు వ్యూహాత్మ‌కంగా క్యాబినెట్ స‌బ్ క‌మిటీని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఉద్యోగ, టీచ‌ర్ల సంఘాల‌తో ప‌లు స‌మావేశాల‌ను నిర్వ‌హించిన త‌రువాత జీపీఎస్ ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది. దీంతో ఆగ్ర‌హించిన సంఘాలు సెప్టెంబ‌ర్ 11వ తేదీన `మిలియ‌న్ మార్చ్` జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. కానీ ఏపీ పోలీసులు నిరాక‌రిండంతో `మిలియ‌న్ మార్చ్‌` శాశ్వ‌తంగా వాయిదా ప‌డింది.

సీపీఎస్ ర‌ద్దు కోరుతూ `ఛ‌లో విజ‌య‌వాడ‌` కార్య‌క్ర‌మం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు టీచ‌ర్లు, ఉద్యోగులు చ‌మ‌ట‌లు ప‌ట్టించారు. ఊహించ‌ని ప‌రిణామంలా ఆ కార్య‌క్ర‌మం స‌క్సెస్ కావ‌డంపై జ‌గ‌న్ సైతం సీరియ‌స్ అయ్యారు. ఫ‌లితంగా ఆ రోజున్న డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ పోస్టు పోయింది. పోలీసు ఉన్న‌తాధికారుల స్థానాలు భారీగా మారిపోయాయి. ప్ర‌స్తుతం పోలీసు యంత్రాంగం మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూర్తి ప‌ట్టు సాధించారు. డీజీపీగా ఉన్న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా యాక్టివ్ గా ఉన్న టీచ‌ర్లు, ఉద్యోగుల మీద ముందుగానే కేసులు న‌మోదు చేయించారు. దీంతో వాళ్లు మిలియ‌న్ మార్చ్ కు దిగ‌డానికి సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు.

2019 ఎన్నిక‌ల సంద‌ర్బంగా సీపీఎస్ ర‌ద్దు హామీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పిన వాటిల్లో ప్ర‌ధాన‌మైన‌ది. అధికారంలోకి వ‌చ్చిన రెండు వారాల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌ని ఆనాడు ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉద్యోగుల‌తో క‌లిశారు. హామీని నిల‌బెట్టుకుంటాన‌ని చెప్ప‌డంతో శాలువాలు, పూల‌దండ‌ల‌తో ఆయ‌న్ను ముంచెత్తారు. ఏడాది త‌రువాత సీన్ క‌ట్ చేస్తే, సీపీఎస్ ర‌ద్దు సాధ్యం కాద‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇక అక్క‌డ నుంచి వార్ ప్రారంభం అయింది. తొలి ప్ర‌యత్నంలో టీచ‌ర్లు, ఉద్యోగులు `చ‌లో విజ‌య‌వాడ‌`తో స‌త్తా చాటారు. ఆ త‌రువాత నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాళ్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.

ఆఫీస్ ల‌కు టైమ్-టైమ్ హాజరుకాకుండా జ‌ల్సాలు చేసుకునే కొంద‌రు టీచ‌ర్లు, ఉద్యోగుల‌ర భ‌ర‌తం పట్టారు. ఇంత కాలం పాటు వాళ్ల‌ను నియంత్రించే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంతో వ్యాపారాలు చేసుకుంటూ గ‌డిపారు. ఇప్పుడు ఫేషియ‌ల్ రిక‌గ్రైజేష‌న్ టెక్కాల‌జీని తీసుకురావ‌డంతో అనివార్యంగా టైమ్ కు రావాల్సి వ‌స్తుంది. లేదంటే , సెల‌వు కింద ప‌రిగ‌ణించ‌బడుతోంది. అంతేకాదు, టీచ‌ర్లు, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌ను ఎక్క‌డ క‌త్తిరించాలో అక్క‌డ క‌త్తిరించారు. సీపీఎస్ ర‌ద్దు ని డిమాండ్ చేస్తోన్న డెలిగేట్ లు కొంద‌ర్ని రాజ‌స్తాన్, చ‌త్తీస్ గ‌డ్ ల‌కు పంపారు. వాళ్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా ఉండే వాళ్ల‌ను స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో అధ్య‌య‌నం త‌రువాత సీపీఎస్ ర‌ద్దు వ‌ల‌న వ‌చ్చే బెనిఫిట్స్ కంటే జీపీఎస్ మంచిద‌నే నివేదిక ఇప్పించే ప‌నిలో ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ ఉంద‌ని తెలుస్తోంది. మొత్తం టీచ‌ర్లు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను అదుపులో పెట్టిన తొలి సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పేరొచ్చింది. అది, ఎన్నిక‌ల్లో క‌లిసొస్తుందా? రాదా? అనేది చూడాలి.