Site icon HashtagU Telugu

AP Government : వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల పంపిణీ.. ఏమేమి ఇస్తున్నారంటే..

Ap Government Distribute Free Essential to Flood Effected People Commodities

Ap Govt

AP Government : ఇటీవల వచ్చిన వర్షాలకు వరదలు ఏరపడి విజయవాడలో సింగ్ నగర్, ఆ చుట్టూ పక్క ప్రాంతాలు మునిగిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు గత మూడు రోజులుగా వరద ముప్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను ఆదుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. చంద్రబాబు, మంత్రులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు,.

ఇప్పటికే వరద ప్రాంతాలు, అక్కడి ఇళ్లను క్లీనింగ్ చేసే కార్యక్రమం మొదలయింది. ఏపీ ప్రభుత్వం తరపున వరద ప్రభావిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపింది. ఈ క్రమంలో వారికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఏపీ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ దగ్గరుండి మరీ ప్రతీ ఇంటికి ఉచిత నిత్యవసర సరుకుల సరఫరా కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు.

దాదాపు 1200 వాహనాలలో వరద ప్రభావిత ప్రజలకు పంచాల్సిన సరుకులు రెడీ చేసారు. విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డు నుంచి ఈ వాహనాలు వరద ప్రభావిత ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడి ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకుల లిస్ట్..

బియ్యం – 25 కేజీ
నూనె – 1లీటరు
పంచదార – 1 కేజీ
కందిపప్పు – 1 కేజీ
ఉల్లిపాయలు – 2 కేజీ
ఆలుగడ్డ – 2 కేజీలు అందిస్తున్నారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు. దీనిపై అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Jani Master : వరదల్లో జానీ మాస్టర్.. నడుములోతు నీళ్ళల్లో బాధితుల్ని పరామర్శిస్తూ.. 500 మందికి సాయం..