Site icon HashtagU Telugu

200 Units of Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై కూటమి ప్రభుత్వం క్లారిటీ

200 Units Free Current

200 Units Free Current

ఆంధ్రప్రదేశ్‌ కూటమి (AP Govt) ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం (200 units free electricity scheme)పై స్పష్టతనిచ్చింది. ఈ పథకాన్ని రద్దు చేసినట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, పథకం కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం కొన్ని మార్గదర్శకాలు (Guidelines) పాటిస్తే అర్హులంతా ఉచిత విద్యుత్‌ లబ్ధి పొందవచ్చని విద్యుత్‌ శాఖ(Electricity Department) తెలిపింది.

గత వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ప్రవేశపెట్టిన ఈ పథకం ఎస్సీ, ఎస్టీ వర్గాల పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడంలో సహకరించింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం నిలిపివేశారని విపక్షాలు ఆరోపించాయి. దీన్ని ఖండించిన కూటమి ప్రభుత్వం, పథకం అమలు నెమ్మదిగా జరుగుతున్నదే తప్ప రద్దు కాలేదని, కొత్త లబ్ధిదారులను కూడా చేర్చుతున్నామని వివరించింది.

ప్రస్తుతం 10,547 మంది కొత్త లబ్ధిదారులు ఈ పథకాన్ని పొందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం, మరింత మంది అర్హుల్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు అంచెల కోత విధానం వల్ల పలు సంక్షేమ పథకాలకు పేదలు అర్హత కోల్పోయారని, కూటమి ప్రభుత్వం దానిని సరిదిద్దే పనిలో ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

ఉచిత విద్యుత్‌ పొందాలనుకునే వారు కొన్ని మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అర్హత కలిగిన వారు తమ కుల ధృవీకరణ పత్రం, అవసరమైన ఇతర పత్రాలతో మీ సేవ కేంద్రాలు లేదా విద్యుత్‌ కార్యాలయాలను సంప్రదించాలి. వీటి ప్రక్రియ పూర్తయిన వెంటనే వారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ప్రభుత్వం పథకం అమలుపై స్పష్టమైన హామీ ఇస్తోంది. లబ్ధిదారులు తగిన పత్రాలు సమర్పించి పథకం ద్వారా లబ్ధి పొందాలని సూచించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా సమర్థవంతంగా ముందడుగు వేయాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read Also : Sankranti Sentiment : సంక్రాంతి నుంచి జనంలోకి జగన్, కేసీఆర్ .. సెంటిమెంట్ కలిసొచ్చేనా ?