Site icon HashtagU Telugu

Akhanda 2: బాల‌య్య‌కు శుభ‌వార్త చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కార్‌!

Akhanda 2

Akhanda 2

Akhanda 2: ఈ వారం టాలీవుడ్‌లో అతిపెద్ద రిలీజ్‌లలో ఒకటైన ‘అఖండ 2’ (Akhanda 2) ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021 బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్. ఈ సినిమాకు భారతదేశంలో పెయిడ్ ప్రీమియర్‌లు ఉండనున్నాయని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 సినిమా ఈనెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ బాలయ్య సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా టికెట్ ధరల పెంపునకు ఆమోదం తెలిపింది.

ఏపీలో టికెట్ ధరల వివరాలు

ప్రీమియర్ షోలు: ప్రీమియర్ షోల (రాత్రి 8 PM, 10 PM మధ్య) టికెట్ ధర అన్ని కేంద్రాలలో రూ. 600 (GSTతో కలిపి)గా నిర్ణ‌యించింది.

సాధారణ షోలు: డిసెంబర్ 5 నుండి 10 రోజుల పాటు ఈ పెద్ద సినిమాకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75 (GSTతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ. 100/- (GSTతో కలిపి) టికెట్ ధరల పెంపును వర్తింపజేశారు. కొత్త జీవో (G.O.) ప్రకారం.. మొదటి పది రోజులకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర సుమారు రూ. 222.5గా, మల్టీప్లెక్స్‌లలో రూ. 277గా ఉండనుంది.

Also Read: Smriti Mandhana: డిసెంబ‌ర్ 7న‌ స్మృతి, పలాష్‌ల పెళ్లి.. అస‌లు నిజం ఇదే!

సంయుక్త మీన‌న్‌, ఆది పినిశెట్టి, ‘భజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలీ మల్హోత్రా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ అన్ని ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి.

Exit mobile version