AP GOVT: అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు పథకం..అధికారికంగా ప్రకటించిన జగన్ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ మరో భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. వైఎస్సార్ కల్యాణమస్తు..పేరుతో కొత్త పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సర్కా

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 09:53 PM IST

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ మరో భారీ సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. వైఎస్సార్ కల్యాణమస్తు..పేరుతో కొత్త పథకాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం కింద SC, ST, BC మైనార్టీలతోపాటు విభిన్న ప్రతిభావంతుల పెళ్లిళ్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.

ఈ పథకం కింద వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని సర్కార్ అందించనుంది. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు 1.30 సాయం..ఎస్సీలకు రూ. 1లక్ష, కులాంతర వివాహం చేసుకునే ఎస్టీలకు రూ. 1.20 లక్షలు అందించనుంది. ఇకు ప్రతిభావంతులకు 1.50లక్షలు ఇవ్వనుంది ప్రభుత్వం.

బీసీలకు రూ. 50వేలు ఇవ్వనుంది సర్కార్. కులాంతర వివాహం చేసుకుంటే 75వేలు అందించనుంది. ముస్లింలకు 1లక్ష చొప్పున పెళ్లి కానుక అందించాలని జగర్ సర్కార్ నిర్ణయించింది. ఈ పథకం విధి విధానాలను శనివారం రాత్రి సర్కార్ అధికారికంగా ప్రకటించింది.