Heavy Rains Effect AP Rs. 6880.23 crore Loss : రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) ఇటీవల కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) అపార నష్టం తెచ్చాయి. ఎక్కడిక్కడే చెరువులకు , వాగులకు గండ్లు పడేసరికి ఆ వరద అంత ఊర్లమీదకు రావడం తో వందల ఇల్లు నీటమునిగాయి. అలాగే రోడ్లు తెగిపోయాయి. వేలాది ఎకరాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఇటు ప్రభుత్వాలు సైతం వరద నష్టాలను అంచనా వేసి కేంద్రానికి పంపే పనిలో ఉన్నాయి.
వరద విపత్తు వల్ల ఏపీకి (AP Floods Loss) దాదాపు రూ. 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, పశు సంవర్ధక శాఖకు 11.58 కోట్ల నష్టం, మత్స్య శాఖకు 157.86 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 301.34 కోట్లు నష్టం, ఉద్యాన శాఖకు 39.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు 481.28 కోట్లు, ఆర్ అండ్ బీ 2164.5 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పంచాయతీ రోడ్లు 167.55 కోట్లు, నీటి వనరులు 1568.55 కోట్లు, పురపాలక, అర్బన్ 1160 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఇటు కేంద్ర మంత్రులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిచారు.
ఇదిలా ఉండగానే మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం స్టార్ట్ అయ్యింది. దీంతో ప్రజలు ఇంకాస్త భయపడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం కారణంగా..ఏపీలో శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం ఉదయం కంచికచర్లలో 33 మిల్లీ మీటర్లు, సాయంత్రం 6 గంటలకు మరో 50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నందిగామ, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటతో పాటు, విజయవాడ నగరంలోనూ వర్షం దంచికొట్టింది.
Read Also : Heavy Rains : మళ్లీ దంచి కొడుతున్న వర్షాలు..ఆందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు