Site icon HashtagU Telugu

Bandana Hari : ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ బందన హరి క‌న్నుమూత

Fisheries corporation chairman

Fisheries corporation chairman

ఆంధ్రప్రదేశ్‌ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌, కాకినాడ పోర్ట్‌ స్టీల్‌ బార్జ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బందన హరి (64) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 200- ఎన్నికల్లో నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున కాకినాడ అర్బన్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసిన అప్ప‌టి కాంగ్రెస్ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం తర్వాత హరి వైఎస్‌ఆర్‌సీలో చేరారు. చంద్రశేఖరరెడ్డి చొరవతో బందన హరి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అనుచరులు ఆయనకు నివాళులర్పించారు . కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మాజీ మేయర్ శివ ప్రసన్న, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ చంద్రకళా దీప్తి, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రం తదితరులు ఆయ‌న‌కు నివాళ్లు అర్పించారు. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, హెచ్‌ఎంఎస్‌ అధ్యక్షుడు సత్తిబాబు, మత్స్యకార బోటు యజమానుల సంఘం అధ్యక్షుడు వనమాడి వీరబాబు తదితరులు బంద‌న హ‌రికి నివాళ్లు అర్పించారు.