ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (AP) ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. వచ్చే ఎన్నికల (Elections) సన్నాహాలలో పార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికార వైసీపీ (YCP) స్పష్టత ఇస్తుండగా, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో టిడిపి , 5 అభ్యర్థులతో జనసేన ప్రకటన చేసాయి. అతి త్వరలో జనసేన నుండి మరో జాబితా రానుంది. ఈ తరుణంలో పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేయడం మొదలుపెట్టాయి. కాగా ఇందులో కొన్ని ఫేక్ సర్వేలు కూడా సోషల్ మీడియా లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఏబీపీ నెట్‌వర్క్ – సీఓటర్ సంస్థతో కలిసి సర్వే చేసిందంటూ ఓ ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సర్వేలు టిడిపి – జనసేన కూటమి 142 స్థానాలు కైవసం చేసుకోబోతుందని , అధికార పార్టీ వైసీపీ 33 కే పరిమితం కాబోతుందని, ఇతరులు అసలు ఖాతాలే తెరవరన్నట్లు ఓ ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది..ఇదే క్రమంలో ఇదే సర్వే పేరుతో మరో ఫేక్ వార్త కూడా వచ్చింది. అందులో వైసీపీ 142 , టిడిపి – జనసేన కూటమి 33 అని తెలిపింది. ఇలా ఒకే సర్వే పేరుతో ఎవరికీ వారు అనుకూలంగా ప్రచారం చేస్తుండడంతో సదరు సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఏబీపీ నెట్‌వర్క్ లేదా ఏదైనా ఇతర అనుబంధ సంస్థ ఏదీ విడుదల చేయలేదు. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024కి సంబంధించి ఏబీపీ నెట్‌వర్క్ అటువంటి డేటా విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ పూర్తిగా కల్పితం. ఆ పోస్టు నకిలీ అయినందున.. ఆ ఫేక్ పోస్ట్ కు ఏబీపీ నెట్‌వర్క్ ఎటువంటి బాధ్యత వహించదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇదే కాదు రాబోయే రోజుల్లో ఇంకా చాల ఫేక్ సర్వేలు వచ్చి ప్రజలను అయోమయం చేయడం ఖాయం,
Read Also : AP BJP : ఏపీలో బీజేపీ పొత్తుపై మిస్సవుతున్న క్లారిటీ..!