Site icon HashtagU Telugu

Kothapalli : మాజీ ఎంపీ `కొత్త‌ప‌ల్లి`కి ఐదేళ్ల జైలు

Kothapalli Geetha Imresizer

Kothapalli Geetha Imresizer

అర‌కు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధిస్తూ హైద‌రాబాద్ లోని సీబీఐ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. రుణ మోసాల‌కు పాల్ప‌డిన బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ శిక్షను వేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జి షీట్ 2015లోనే సీబీఐ దాఖలు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వాళ్ల‌ను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై. హైకోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది.