AP Employees: దేశంలోనే ఏపీ ఉద్యోగులు నెంబ‌ర్ 1 భోక్త‌లు

భార‌త దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్ర‌భుత్వం మొత్తం ఖ‌ర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండ‌గా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా 36శాతం ఉంది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 01:02 PM IST

భార‌త దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్ర‌భుత్వం మొత్తం ఖ‌ర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బ‌డ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండ‌గా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల వాటా 36శాతం ఉంది. అంటే తెలంగాణ ఉద్యోగుల కంటే 15శాతం అద‌నంగా ల‌బ్ది పొందుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా అద‌న‌పు ల‌బ్ది కోసం 14.29 శాతం ఫిట్ మెంట్ కు సిఫార‌స్సు చేయ‌డం ఏపీ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించ‌డానికి ఉద్యోగ సంఘాల నేత‌లు కంక‌ణం క‌ట్టుకున్నారు.

పీఆర్సీని అమ‌లు చేస్తే 10వేల కోట్ల‌కు పైగా భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే జీతాలు, పెన్ష‌న్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగుల‌కు ఖ‌ర్చు పెడుతున్నారు. ఇదంతా బ‌డ్జ‌ట్ లెక్క ప్ర‌కారం నిర‌ర్థ‌క‌ ఖ‌ర్చు కింద చూపిస్తారు. ఏ మాత్రం తిరిగిరాని ఖ‌ర్చుల కింద 68 వేల కోట్ల‌ను ఉద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంది. ఉద్యోగ నేత‌ల డిమాండ్ ప్ర‌కారం పీఆర్సీ అమ‌లు చేస్తే మ‌రో 10వేల కోట్ల ఖ‌ర్చు క‌లుస్తోంది. అంటే, 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల కింద ఏపీ ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాల‌కు ప్ర‌తి నెలా అప్పులు చేయాల్సిన దుస్థితికి ఏపీ ప్ర‌భుత్వం వెళ్ల‌నుంది.

ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం సుమారు 6.50లక్ష‌ల కోట్ల‌కు వ‌ర‌కు అప్పులు చేసింది. ఉన్న ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెట్టింది. వివిధ ప్ర‌భుత్వ సంస్థ‌ల నుంచి వ‌చ్చే రాబ‌డిని ష్యూరిటీ కింద చూపిస్తూ అప్పులు తీసుకొచ్చారు. ఆర్బీఐ నిబంధ‌న‌ల‌ను ఎప్పుడో దాటేసింది. ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల‌ను ప‌క్క‌న పెడుతూ అప్పులు చేసింది. ఆ విష‌యం ఉద్యోగుల‌కు తెలుసు. పైగా రెండేళ్లుగా జీతాలు ఇంట్లో కూర్చుని తీసుకున్నారు. వారానికి ఐదు రోజుల ప‌నిదినాలు. ఉచిత భోజ‌న, వ‌స‌తులు, ప్ర‌యాణాలు..వైద్యం ఇలా అన్నీ ఫ్రీగా ఉద్యోగులు అనుభ‌విస్తున్నారు. ఇంకా వాళ్ల‌కు సామాన్యుల మీద క‌నిక‌రం లేకుండా పీఆర్సీతో పాటు 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందు ఉంచారు.

11వ ఆర్థిక సంఘం నివేదిక ప్ర‌కారం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేశార‌ని సీఎం జ‌గ‌న్ కు ఇచ్చిన నివేదిక‌లో పొందుప‌రిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరింద‌ని వివ‌రించారు. ఎస్ ఓ ఆర్ లో న‌మోదు చేసిన వివ‌రాల ప్ర‌కారం 2018-19లో జీతాలు 84 శాతం ఉంద‌తి. గ‌త ఆర్థిక ఏడాది 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరింది.
ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమ‌ని చీఫ్ సెక్ర‌ట‌రీ స‌మీర్ శ‌ర్మ ఇచ్చిన నివేదిక స్ప‌ష్టం చేసింది. జీతాలు, పెన్షన్ల వ్యయం 2020-21 లో 36 శాతానికి పెరిగింది. 2020-21లో తెలంగాణలో జీతాలు, పెన్షన్ల వ్యయం 21 శాతమేనని నివేదిక‌లో పొందుప‌రిచారు. . ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ సిఫారసు చేస్తూ సీఎస్ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ నివేదిక ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.