ఏపీ ఉద్యోగులు జగన్ సర్కార్ పై సమ్మె సైరన్ మోగించడానికి సిద్ధం అయ్యారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. వచ్చే నెలా 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు షురూ చేశారు. నోటీసులు ముందుగా శుక్రవారం రోజు ఇవ్వనున్నారు. ఈనెల 21న సమ్మె నోటీసులను చీఫ్ సెక్రటరీకి అందచేస్తారు. ఆ తరువాత 23న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఈనెల 25న కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలకు దిగునున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26న అంబేద్కర్ విగ్రహానాఇకి వినతిపత్రం అందచేస్తారు. 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వర్క్ టూ రూల్ ను పాటిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు యాప్ లను నిలిపివేస్తారు. ఫిబ్రవరి 6 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారు. ఆ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా..
👉 23-01-2022 రౌండ్ టేబుల్ సమావేశం.
👉 25-01-2022 కలెక్టరేట్ ఎదుట ధర్నా.
👉 26-01-2022 రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.
👉 27/01/2022– 30/011/2022- వర్క్ టు రూల్
👉 01-02-2022 నుండి 05 -02-2022 యాప్స్ నిలుపుదల
👉 06-02-2022 అర్ధరాత్రి నుంచి సమ్మె..
PRC Issue : ఏపీ ఉద్యోగుల సమ్మె షురూ

Ap Employees