AP Employees : జ‌గ‌న్ కు పాలాభిషేకం తెచ్చిన‌ తంటా! మంత్రి ఛాంబ‌ర్ కు ఉద్యోగుల తాళం

ఏపీ ఉద్యోగుల (AP Employees) ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేల‌ను నిల‌దీసే వ‌ర‌కు వాళ్ల ఆందోళ‌న చేరుకుంది.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 03:31 PM IST

ఏపీ ఉద్యోగుల (AP Employees) ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేల‌ను నిల‌దీసే వ‌ర‌కు వాళ్ల ఆందోళ‌న చేరుకుంది. ఒక వైపు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పాలాభిషేకం చేయ‌డానికి ఉద్యోగ సంఘాలు పోటీప‌డుతున్నారు. మ‌రో వైపు స‌చివాల‌య ఉద్యోగులు బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి చెల్లుబోయిన‌ వేణుగోపాలకృష్ణ ఛాంబ‌ర్ కు తాళం వేసి నిర‌స‌న‌కు దిగారు. ఎనిమిది నెలలుగా వేతనాలను చెల్లించడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు మంత్రి ఛాంబ‌ర్ కు తాళం వేయ‌డం గ‌మ‌నార్హం.

మంత్రి చెల్లుబోయిన‌ వేణుగోపాలకృష్ణ ఛాంబ‌ర్ కు తాళం (AP Employees)

ఏపీ ప్ర‌భుత్వం 2022 నవంబర్ నుండి వేతనాలను స‌క్ర‌మంగా చెల్లించ‌లేక‌పోతోంది. మంత్రులు, ఉన్న‌తాధికారులకు ప‌లుమార్లు ఉద్యోగులు చెప్పారు. కానీ, ఫ‌లితం లేకుండా పోయింది. ఒకానొక స‌మ‌యంలో డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌డం దేవుడెరుగు ప్ర‌తినెలా ఒక‌టో తేదీన జీతాలు ఇవ్వాల‌ని ఉద్యోగులు(AP Employees) డిమాండ్ చేశారు. ఆ మేర‌కు సంఘాల నేత‌లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. అంతే, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కోపం వ‌చ్చింది. ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేత‌ల జాబితాను రాబట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘం ర‌ద్దుకు సిఫార‌స్సు చేశారు. దానిపై న్యాయ‌స్థానంకు ఉద్యోగ సంఘం నేత‌లు వెళ్లారు. అనుకూలంగా హైకోర్టు తీర్పును చెప్పింది. దాన్ని స‌వాల్ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది.

ఒక‌టో తేదీన జీతాలు ఇవ్వాల‌ని ఉద్యోగులు డిమాండ్

ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములు ఉద్యోగులు(AP Employees). ప్ర‌త్యేకించి స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతుంటారు. వాళ్లు ఇచ్చే సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు ప్ర‌భుత్వాలు న‌డిచేవి. ఒకానొక సంద‌ర్భంగా సీఎంల‌ను కొంద‌రు డిక్టేట్ చేసే స్థాయికి కూడా వెళ్లారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ప్ర‌భుత్వం ఉద్యోగుల కోర‌లు పీకుతూ వ‌చ్చారు. దీంతో క‌నీసం జీతాలు అయినా ప్ర‌తినెలా ఒక‌టో తేదీన ఇవ్వండ‌ని వేడుకున్నారు. అయిన‌ప్ప‌టికీ జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది. అదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌డాన్ని రాజ‌ద్రోహం కింద జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిగ‌ణించింది. ప్ర‌భుత్వం ఉద్యోగ సంఘం ర‌ద్దుతో పాటు దాని నేత సూర్య‌నారాయ‌ణను అరెస్ట్ చేయ‌డానికి ఏపీ పోలీసులు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయ‌డాన్ని రాజ‌ద్రోహం కింద జ‌గ‌న్ స‌ర్కార్

ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చేసిన 90 రోజుల నిర‌స‌న‌కు ప్ర‌భుత్వం దిగొచ్చింద‌ని ప్ర‌భుత్వం ఉద్యోగులు సంఘం జేఏసీ అమ‌రావ‌తి నేత బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. మొత్తం 47 డిమాండ్లో 32 నెర‌వేరాయ‌ని, అందుకు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రుణ‌ప‌డి ఉండాల‌ని పిలుపునిచ్చారు. అదే త‌ర‌హాలో రెవెన్యూ, పంచాయ‌తీ రాజ్ , ప్ర‌భుత్వం, ఎన్జీవో, నాన్ ఎన్జీవో సంఘాల నేత‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లుసుకుని అభినంద‌న‌లు తెలిపారు. మ‌రే సీఎం ఇవ్వ‌న‌న్న బెనిఫిట్స్ ఇవ్వ‌డంతో పాటు 12వ పీఆర్సీని వేశార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయా సంఘాల నేత‌ల వాల‌కాన్ని గ‌మ‌నించిన ఉద్యోగులు(AP Employees) గ‌త నాలుగు రోజులు ఆగ్ర‌హంగా ఉన్నారు. రాజ‌కీయంగా అమ్ముడుపోయిన సంఘాల నేత‌ల తీరును బాహాటంగా ఆరోపిస్తున్నారు. ప్ర‌తి నెలా జీతాలు ఇవ్వ‌డానికి కూడా ప్ర‌భుత్వం సిద్ధంగాలేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పాలాభిషేకం ఏమిటి? అంటూ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.

స‌చివాల‌య ఉద్యోగుల ఆగ్ర‌హం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీదకు (AP Employees)

స‌చివాల‌య ఉద్యోగుల ఆగ్ర‌హం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీదకు వెళ్లింది. ఆయ‌న ఛాంబ‌ర్ కు తాళం వేయ‌డంతో నిర‌స‌న తారాస్థాయికి చేరింది. ఉన్న‌తాధికారులు స‌ర్థిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఉద్యోగులు మాట‌విన‌కుండా ఛాంబ‌ర్ కు తాళం వేసి(AP Employees) వెళ్లిపోయారు. గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా స‌చివాల‌యం కేంద్రంగా చోటుచేసుకున్న సంఘ‌ట‌న రాష్ట్రం వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఇలాంటి ప‌రిస్థితి మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Also Read : AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక‌, సూర్య‌నారాయ‌ణపై పోలీస్ వేట‌

స‌హాయ నిరాక‌ర‌ణ‌, పెన్ డౌన్, న‌ల్ల బ్యాడ్జిల‌తో నిర‌స‌న ఇలా…విడ‌త వారీగా 90 రోజుల పాటు ఉద్యోగులు ఆందోళ‌న నిర్వ‌హించారు. ఎన్నిక‌ల‌కు ముందుగా సీపీఎస్ ర‌ద్దు ప్ర‌క‌టించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట త‌ప్పార‌ని నిర‌స‌న‌కు దిగారు. దాని బ‌దులుగా జీపీఎస్ ను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో క‌ట్ట‌లు తెచ్చుకున్న ఉద్యోగులు (AP Employees)ప్ర‌భుత్వంపై తిరుగుబాటును ప్ర‌క‌టించారు. ఒక మంత్రి ఛాంబ‌ర్ కు తాళం వేయ‌డంతో మిగిలిన మంత్రులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. జిల్లాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డితే, ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం క‌ష్టంగా మార‌నుంది. ప్ర‌స్తుతం స‌చివాల‌యం వ‌ద్ద ప్రారంభ‌మైన ఛాంబ‌ర్ల మూసివేత నిర‌స‌న వ్యాప్తి చెందితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు అవ‌మాన‌మే.

Also Read : AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం