Site icon HashtagU Telugu

AP Employees: సీపీఎస్ రద్దుకు సెప్టెంబరు1న 4 లక్షల మందితో మార్చ్

AP employees

AP employees

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాష్ట్ర ఉద్యోగులు మండిపడుతున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థను పునరుద్ధరిస్తానని ఇచ్చిన మాటను జగన్ తప్పారని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో జగన్ విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ అంశాలపై ఇప్పటికే పలు దఫాలుగా పోరాటం చేసిన సీపీఎస్ ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు.

“దగాకోరు మోసం” పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా సెప్టెంబరు 1న విజయవాడలో 4 లక్షల మంది ఉద్యోగులతో మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతోపాటు ఇకపై కలిసి ఉద్యమించాలని ఏపీసీపీఎస్ ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబరు 1న జరిగే మార్చ్ కూడా రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని వెల్లడించారు.

Exit mobile version