AP Employees: భయం.. భయం!

ఉద్యమం చేసే వాళ్లకు భయం అనేది ఉండకూడదు. ఆస్తులు, అంతస్తులు పోయిన స్థిరంగా ఉండాలి.

  • Written By:
  • Updated On - January 28, 2022 / 02:14 PM IST

ఉద్యమం చేసే వాళ్లకు భయం అనేది ఉండకూడదు. ఆస్తులు, అంతస్తులు పోయిన స్థిరంగా ఉండాలి. ఎదుటి వాళ్ల దాడిని చూసి వెనక్కు తగ్గ కూడదు. ఇవన్నీ ఉండాలి అంటే పోరాటానికి దిగిన వాళ్ళలో నిజాయితీ ఉండాలంటారు యోధులు. కానీ , ఉద్యోగ సంఘం నాయకుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయకుండానే ఏసీబీ, సీఐడీ దాడులు చేయబోతున్నారంటూ ఉలిక్కి పడుతున్నాడు. మిగిలిన వాళ్లలో కూడా జంకు వచ్చేలా ఆయన మాటలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఉద్యమం చివరి వరకు ఉంటారా? అంటే అనుమానమే.ఇచ్చిన పీఆర్సీ చాలదని ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. అమరావతి జేఏసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు కోరారు. గతంలో ఎప్పుడూ కార్మిక ఉద్యమాలకు పెద్దగా ఉద్యోగ సంఘాలు కలిసి వెళ్ల లేదు. పై గా కార్మిక సంఘాల డిమాండ్లు, ఉద్యోగుల సమస్యలు వేరు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాన్ని లాభాల బాట పట్టించే క్రమంలో జగన్ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంలో విలీనం కారణంగా కోవిడ్ 19 సమయంలో డ్యూటీ చేయకపోయినా జీతాలు తీసుకోగలిగారు. అదే కార్పొరేషన్ పరిధిలోనే ఉంటే జీతాలు కోవిడ్ సమయంలో వచ్చేవి కాదు అనేది కార్మికుల భావన. ఇలాంటి అభిప్రాయం ఉన్న కార్మికుల మద్దతు కోసం ఉద్యోగ సంఘాలు వెళ్లాయి. కేవలం మాజ్దూర్ యూనియన్ తప్ప మిగిలిన వాళ్ల నుంచి అనుకూల పరిస్థితి కనిపించలేదు. మాజ్దూర్ యూనియన్ ఎప్పుడు ఎవరు ఉద్యమం చేసిన మాట సహాయం చేస్తుంది. కమ్యూనిస్ట్ మద్దతు ఉంటుంది. అందుకే , ఉద్యోగ సంఘాలకు మౌఖిక సంఘీభావం తెలిపారు. వాళ్ళు కూడా ఆర్టీసీ నష్ట పోతుందంటే..సమ్మెకు వెళ్ళరు.

ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఎంత వరకు ఉద్యమంలో నిలబడతారో…కార్మిక సంఘాలు అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వాలను పడగొడతాం..ఎక్కిస్తాం అంటూ సవాల్ చేసిన బండి ఇప్పుడు ప్రభుత్వం చేసే దాడులపై ముందే ఊహిస్తున్నాడు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వార్ జరుగుతున్నప్పుడు ఎవరికి చేతనైన పని వాళ్లు చేస్తారు. ఇప్పటికే జగన్ ఇచిన టోల్ ఫ్రీ నెంబర్ లకు బోలెడు ఫిర్యాదులు వచ్చాయి. అవినీతి ఎక్కడ.. ఎవరు పెద్దగా చేశారో..ప్రభుత్వానికి 1తెలుసు. ఉద్యోగ సంఘాల నేతలు కొందరు హైద్రాబాద్, విశాఖ, విజయవాడలో ఆస్తులు కూడ బెట్టింది కూడా ప్రభుత్వానికి తెలియని వివరాలు కాదు. ఫిబ్రవరి 6వ తేదీ తరువాత అసలు కథ రక్తి కట్టనుంది.
చర్చలకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. గొంతెమ్మ్ కోర్కెలు కాకుండా వాస్తవానికి అనుగుణంగా జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చంద్ర బాబు లాగా అన్ని ఉచితంగా ఇవ్వడానికి జగన్ సిద్ధంగా లేడు. డబుల్ హెచ్ ఆర్ ఏ లు , ఉచిత భోజనాలు, ఉచిత ప్రయాణాలు, ఉచిత వైద్య , ఉచిత స్థలాలు ఇవ్వడానికి జగన్ సర్కార్ సిద్ధంగా లేదు. ఆ విషయం ఉద్యోగ సంఘాలకు తెలుసు. ఇష్టానుసారంగా ఐ ఆర్ లు పెంచుకుంటూ పోయిన తరువాత దానికి అర్థం లేదు. 11వ పీఆర్సీ ని అసితోష్ మిశ్రా సిఫార్సు కు అనుగుణంగా అడుగుతున్నారు. మరి స్వామినాథన్ కమిటీ సూచన మేరకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని ఉద్యమం చేసినప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు ఎక్కడికి వెళ్లాయి?అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు.

సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అని అర్థం అవుతుంది. వాళ్ల అవినీతి ఎక్కువ అయింది. ఆ మేరకు నివేదికలు, టోల్ నంబర్ లను చూస్తే అర్థం అవుతుంది. ఇప్పటికే అవినీతి పరుల జాబితా ప్రభుత్వం వద్ద ఉంది. మండలం వారీగా అవినీతి పరుల జాబితా సిద్దం చేసిన ప్రభుత్వం. విడతల వారీగా బడా అవినీతి పరుల ఆస్తులు బయటకు తీయడానికి రెడి అయిందని సచివాలయ వర్గాల టాక్. ఇక ఏసీబీ, సిఐడి రంగంలోకి దిగడానికి ఎన్నో రోజులు లేవు. అందుకే ముందుగా ప్రజా సానుభూతి కోసం దాడులకు ప్రభుత్వం సిద్దం అవుతుందని చెబుతున్నాడు బండి.
ఇవాళ కూడా చర్చలకు సంఘల నాయకులు దూరంగా ఉన్నారు. జీవోలను రద్దు చేస్తే చర్చలకు వస్తామని చెబుతున్నారు. అవి రద్దు చేసిన తరువాత ఇక చర్చలు ఎందుకని ప్రభుత్వం అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు నిలబడితే ..అవినీతి పరులు బయటకు వచ్చే అవకాశం ఉంది. చర్చలకు వెళ్తే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. సో..సమ్మెకు వెళ్తేనే సమాజానికి మంచి జరుగుతుందని సామాన్యులు భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అవినీతి పరుల చిట్టా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో..జగన్ దెబ్బ అంటే ఏమిటో ఉద్యోగులు త్వరలోనే చూస్తారన్నమాట.