AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక‌, సూర్య‌నారాయ‌ణపై పోలీస్ వేట‌

ఉద్యోగ సంఘాల‌ను(AP employees) జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చీల్చారు.ధ‌న్య‌వాదాలు తెలుపుతూ బొప్ప‌రాజు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 04:00 PM IST

ఏపీ ఉద్యోగ సంఘాల‌ను(AP employees) సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చీల్చారు. ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఉద్యోగ సంఘం జేఏసీ చైర్మ‌న్ బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. గ‌త 90 రోజుల నుంచి చేస్తోన్న ఉద్య‌మానికి జ‌గ‌న్ స‌ర్కార్(Jagan sarkar) సానుకూలంగా స్పందించింద‌ని చెప్ప‌డం కొంద‌రు ఉద్యోగుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. మొత్తం 47 డిమాండ్ల‌లో 32 ప‌రిష్కారం అయ్యాయ‌ని ప్ర‌క‌టిస్తూ ఇక ఉద్య‌మం ఉండ‌ద‌ని తేల్చేశారు. స‌రిగ్గా ఈ స్టేట్మెంట్ ఉద్యోగ సంఘాల్లోని అనైక్య‌త‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఏపీ ఉద్యోగ సంఘాల‌ను సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(AP employees) 

సీపీఎస్ (CPS)ర‌ద్దు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ప్ర‌ధాన హామీ. దాన్ని అమ‌లు చేయ‌లేమ‌ని జీపీఎస్ ను క్యాబినెట్ ఆమోదించింది. మంత్రి వ‌ర్గ ఉప సంఘం, ఉద్యోగ సంఘం నేత‌ల‌తో సంప్ర‌దించిన త‌రువాత జీపీఎస్ కు సిఫార‌స్సు చేయ‌డం జ‌రిగింది. కానీ, పాత పెన్ష‌న్ విధానం కావాల‌ని కోరుతూ బొప్ప‌రాజు ఉద్య‌మాన్ని విర‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గంద‌ర‌గోళానికి దారితీసింది. 12వ పీఆర్సీని వేయ‌డం ఉద్యోగులు సాధించిన విజ‌యంగా ఆయ‌న చెబుతున్నారు. అయితే, కొన్ని ఉద్యోగ సంఘాలు మాత్రం బొప్ప‌రాజు మీద వ్య‌తిరేకంగా స్పందిస్తున్నాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ(Suryanarayana) ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. ఆయ‌న కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అరెస్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేశారు. ఇలా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న వాళ్ల‌ను టార్గెట్ చేయ‌డం జరిగింది. దానిపై ఉద్యోగ సంఘం జేఏసీ అమ‌రావ‌తి ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం (AP employees)గ‌మ‌నార్హం.

బొప్ప‌రాజు ఉద్య‌మాన్ని విర‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం గంద‌ర‌గోళానికి

ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాన్ని ర‌ద్దు ఎందుకు చేయ‌కూడ‌దంటూ జ‌గ‌న్ స‌ర్కార్ న్యాయ‌స్థానంకు వెళ్లింది. హైకోర్టులో సంఘానికి అనుకూలంగా తీర్పు వ‌చ్చిన‌ప్ప‌టికీ సుప్రీంలో స‌వాల్ చేయ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఆ సంఘం నేత సూర్యనారాయ‌ణ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఏపీ పోలీస్ విచార‌ణ చేస్తోంది. అంతేకాదు, ఆయ‌న మీద మ‌రో ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాస‌రావు(Bandi Srinivasarao) ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆస్తులు, అంత‌స్తుల మీద విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఫ‌లితంగా అటు సూర్య‌నారాయ‌ణ ఇటు శ్రీనివాస‌రావు మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి. ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుగా శ్రీనివాసరావు మెలుగుతున్నారు. ఇప్పుడు ఆయ‌న బాట‌న బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు (Bopparaju venkateswarlu)కూడా ఉన్నార‌ని స‌చిలయంలోని టాక్‌.

ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై కేసుల ప‌ర్వం 

రాష్ట్రంలోని వివిధ ఉద్యోగు, ఉపాధ్యాయ సంఘాల బ‌లం(AP employees) ఏమిటో రెండేళ్ల క్రితం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రుచిచూశారు. ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్రమం సంద‌ర్భంగా రోడ్ల‌న్నీ ఉద్యోగుల మ‌యమైన దృశ్యాలు ఇప్ప‌టికీ క‌ళ్ల‌ముందు మెదులుతున్నాయి. ఆ స‌మ‌యంలో స‌రిగ్గా పోలీసు వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌లేద‌ని అప్ప‌ట్లో ఉన్న డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ (Goutam )ను మార్చేశారు. ఆయ‌న స్థానంలో క‌డ‌ప జిల్లాకు చెందిన రాజేంద్ర‌నాథ్ రెడ్డిని(Rajendranath Reddy) డీజీపీగా నియ‌మించారు. ఆ రోజు నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల మీద కేసుల న‌మోదు వేగం పెరిగింది. ఉద్య‌మం చేయ‌డానికి ముందుకొచ్చే ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై కేసుల ప‌ర్వం కొన‌సాగింది. ఫ‌లితంగా మ‌లివిడ‌త ఉద్య‌మం నీరుగారిపోయింది. ప‌లుమార్లు ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి పిలుపు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ తిరిగి కార్య‌రూపం దాల్చ‌లేదు.

Also Read : AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

ఎంపిక చేసిన ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌తో మంత్రివ‌ర్గ ఉప సంఘం ఉద్యోగుల డిమాండ్ల మీద చ‌ర్చ‌లు జ‌రిపింది. వాళ్ల గొంతెమ్మ కోర్కెల‌ను తీర్చ‌లేమ‌ని తొలి రోజుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ మొఖం చాటేసింది. కానీ, ఉద్యోగ సంఘాల జేఏసీ అమ‌రావ‌తి ఉద్య‌మానికి పిలుపునిచ్చింది. గాంధీయ‌మార్గంలో 90 రోజులు పెన్ డౌన్ నుంచి ప‌లు విధాలుగా నిర‌స‌న‌లు చేసింది. ఫ‌లితంగా 12వ పీఆర్సీని వేయ‌డంతో పాటు డీఏల‌ను పెంచారు. జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగుల‌కు హెచ్ ఆర్యే ల‌ను 16శాతంకు పెంచారు. ఇలా ఉద్యోగ సంఘాలు ఉంచిన 47 డిమాండ్ల‌లో 32 సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. ఆ విష‌యాన్ని జేఏసీ చైర్మ‌న్ చెబుతూ ఉద్య‌మాన్ని విర‌మించారు. ఉద్యోగుల్లో ఇప్పుడు కేవ‌లం 15 మంది మాత్ర‌మే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా (AP employees)ఉన్నార‌ని డిప్యూటీ సీఎం నారాయ‌ణ వెల్ల‌డించారు. అంటే, దాదాపుగా 85శాతం మంది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పంచ‌న చేరార‌న్న‌మాట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో సూర్య‌నారాయ‌ణ‌కు రాజ‌ద్రోహం కింద క‌ట‌క‌టాలు త‌ప్పేలా లేదు.

Also Read : AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం!