AP Employees : ఏపీ ఉద్యోగ సంఘాల్లో ఐక్య‌త ఏదీ…?

ఏపీలో ఉద్యోగ సంఘాల మ‌ధ్య చీలిక ఏర్ప‌డిందా అని అంటే అవున‌నే స‌మాదానం వినిపిస్తుంది.వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తాన‌ని పాద‌యాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌మీ ఇచ్చారు. సీపీఎస్ విష‌యంలో అయితే ఆయ‌న ఒక అడుగు ముందుకు వేసి అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే సీపీఎస్ ని ర‌ద్దు చేస్తాన‌న్నారు.

Published By: HashtagU Telugu Desk
Ap Empl Letter

Ap Empl Letter

ఏపీలో ఉద్యోగ సంఘాల మ‌ధ్య చీలిక ఏర్ప‌డిందా అని అంటే అవున‌నే స‌మాదానం వినిపిస్తుంది.వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరిస్తాన‌ని పాద‌యాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌మీ ఇచ్చారు. సీపీఎస్ విష‌యంలో అయితే ఆయ‌న ఒక అడుగు ముందుకు వేసి అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే సీపీఎస్ ని ర‌ద్దు చేస్తాన‌న్నారు. ఈ హామీల వ‌ర్షంతో ఉద్యోగులు వైసీపీకి మ‌ద్ధ‌తుగా నిలిచారు. 2019 లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఆ త‌రువాత ఉద్యోగులకు ఇచ్చిన హామీలు జ‌గ‌న్ నేర‌వేరుస్తున్నార‌ని వారంతా ఆశ‌గా చూశారు. కానీ రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్నా ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వంపై ఉద్యోగ సంఘాలు యుధ్దం ప్ర‌క‌టించారు.పీఆర్సీతో పాటు ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.ఏపీలో ఉద్యోగ సంఘాలు రెండు జేఏసీలుగా ఏర్ప‌డి ప్ర‌భుత్వంపై యుధ్ధం ప్ర‌క‌టించాయి. అయితే ఇందులో కొంత మంది ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలప‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రెజ‌రీ ఉద్యోగుల సంఘం ఉమ్మ‌డి జేఏసీ 11వ పీఆర్సీ కోసం త‌ల‌పెట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మానికి తాము దూరంగా ఉంటున్నామ‌ని బ‌హిరంగ‌గానే ప్ర‌క‌ట‌న ఇచ్చారు.సీఎం జ‌గ‌న్ పీఆర్సీని ప‌దిరోజుల్లో ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపారని…అందుకోసం ఈ ఆందోళ‌న‌లో తాము పాల్గొన‌డం లేద‌ని ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ ఆందోళ‌న‌లో పాల్గొంటున్నామ‌ని తెలిపింది. ఏపీ ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట‌మెంట్ ఎంప్లాయింస్ యూనియ‌న్ లేఖ‌ను క‌మిష‌న‌ర్ కి పంపింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు రావాల్సిన పీఆర్సీతో ఉద్యోగుల స‌మ‌స్య‌లు, ఆర్టీసీ విలీనం త‌రువాత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా తాము కూడా నిర‌స‌న‌లో పాల్గొంటున్నామ‌ని పీటీడీఈయూ తెలిపింది.ఆర్టీసీని ప్ర‌భుత్వ‌లో విలీనం చేస్తామ‌ని చెప్పిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట నిల‌బెట్టుకున్నారు కానీ ఈ విలీన ప‌క్రియ మాత్రం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు. విలీనం పేరుతో త‌మ‌కు రావాల్సిన బెనిఫిట్స్ ని తీసేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల ప‌రిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంద‌ని వాపోతున్నారు.

Bandi Ys Jagan

ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాడేంద‌కు తాను చిత్తశుద్ధితో ఉన్నాన‌ని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్య‌క్షుడుయ బండి శ్రీనివాసులు అన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 71 డిమాండ్లు ప్రభుత్వానికి ఇచ్చామ‌ని…నాలుగు సంవత్సరాలైనా పి ఆర్ సి లేదన్నారు. పెండింగ్ లో ఉన్న 16లవేల కోట్ల రూపాయిల ఆర్థికపరమైన డిమాండ్లు నేరవెర్చాలని కోరామ‌ని…తాము దాచుకున్న డబ్బులు సైతం చెల్లింపులు జరపడం లేదని ఆయ‌న ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కార్యచరణ ప్రకటించామ‌ని….పి ఆర్ సి రిపోర్ట్ బయటపెడితేనే..దానిలోని సమస్యలు తెలుస్తాయని బండి శ్రీనివాసులు అన్నారు. వారంలో పి ఆర్ సి ఇస్తామని సి ఏం చెప్పారని.. కానీ త‌మ ఉద్యమం ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఉద్యమంలో భాగంగా ఉద్యోగుల్ని ఉత్తేజ పరచడానికి కొన్ని వ్యాఖ్యలు చేశాన‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే దానిని బూతద్దంలో చూపి.. ప్రభుత్వానికి దూరం చేసేలా పార్టీ కోసం ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులు ఏవరికి ,ఏ పార్టీకి తోత్తుగా వ్యవహరించమ‌ని… ఏముఖ్యమంత్రితోనైనా సత్సంబంధాలు తోనే నడుస్తామ‌న్నారు. త‌న వ్యాఖ్య ల్లో ఏవిధమైన రాజకీయ కోణం లేద‌ని.. తాను ఏవరి తో త్తును కాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మొత్తానికి ఉద్యోగ సంఘాలు మాత్రం రెండు వ‌ర్గాలుగా విడిపోయార‌నేది ప్ర‌క‌ట‌నల ద్వారా తెలుస్తుంది

  Last Updated: 07 Dec 2021, 12:02 PM IST