AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అస‌లైన స‌వాల్ ఇప్పుడు స‌మీపిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 04:08 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అస‌లైన స‌వాల్ ఇప్పుడు స‌మీపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగుల‌పై (AP Employees) పైచేయిగా నిలిచారు. ఈసారి అలా ఉండ‌ద‌ని (Jagan) ఉద్యోగ సంఘం నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. తొలుత సెల్ డౌన్, ఆ త‌రువాత పెన్ డౌన్ , భోజ‌న విరామ నిర‌స‌న‌లు చివ‌రిగా స‌హాయ నిరాకర‌ణ‌కు వెళ్ల‌డానికి ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు మార్చి 9వ తేదీని డెడ్ లైన్ గా పెట్టారు. ఆ మేర‌క ప్ర‌భుత్వానికి నోటీసులు ఉద్యోగ సంఘం నేత‌లు అందించారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అస‌లైన స‌వాల్(AP Employees)

ఉద్యోగుల నుంచి తొలి నిర‌స‌న ఏడాదిన్న‌ర క్రితం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) చ‌విచూశారు. ఆ రోజున ఉద్య‌మించిన ఉద్యోగుల దెబ్బ‌కు ఆయ‌న క్రేజ్ మ‌స‌క‌బారింది. అప్ప‌టి నుంచి ఉద్యోగుల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ వెంటాడింది. ఛ‌లో విజ‌య‌వాడ విజ‌య‌వంతం కావ‌డానికి పోలీసుల ఉదాసీన‌త కార‌ణంగా భావించారు. అందుకే, ఆ రోజు డీజీపీగా ఉన్న గౌత‌మ్ సవాంగ్ ను ప‌క్క‌న పెట్టేశారు. ఆ త‌రువాత డీజీపీగా సొంత జిల్లా, సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన రాజేంధ్ర‌నాథ్ రెడ్డిని నియ‌మించారు. వెంట‌నే `చ‌లో విజ‌య‌వాడ‌` ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఉద్యోగ నేత‌ల్ని వెంటాడారు. ప‌లువురి మీద కేసులు పెట్టారు. ఆంక్ష‌లు విధించారు. మ‌రో ఉద్య‌మానికి ఆరు నెల‌ల క్రితం ఉద్యోగ సంఘాలు(AP Employees) పిలుపు ఇవ్వాల‌ని యోచించారు. కానీ, ప‌రిస్థితులు అనుకూలంచ‌కుండా పోలీసులు చేశారు. దీంతో నిమ్మ‌కుండిపోయిన ఉద్యోగ సంఘం నేత‌లు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు.

Also Read : AP Employees : ఏపీ ఉద్యోగ సంఘం విజ‌యం! `సుప్రీం` దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ !

ప్ర‌తినెలా జీతాల‌ను ఇవ్వ‌లేక‌పోతున్న ప్ర‌భుత్వం మీద గ‌వ‌ర్న‌ర్ కు ఉద్యోగు సంఘం నేత‌లు(AP Employees) ఇటీవ‌ల ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్ర‌హించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఆ సంఘాన్ని ర‌ద్దు ఎందుకు చేయ‌కూడదు? అంటూ నోటీసులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఆ నోటీసును బేస్ చేసుకుని హైకోర్టుకు ఉద్యోగ సంఘం నేత‌లు వెళ్లారు. వాళ్ల‌కు సానుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య నెల‌కొన్ని ప్ర‌తిష్టంభ‌న తాత్కాలికంగా తొల‌గింది. అయితే, ఇప్పుడు స‌మ‌స్య ప‌రిష్కారం కోరుతూ నోటీసులు ఇవ్వ‌డంతో మ‌ళ్లీ యుద్ధం మొద‌ల‌యింది. మార్చి 9వ తేదీ నుంచి ఉద్యోగులు స‌హాయ నిరాక‌ర‌ణ దిశ‌గా ఒక్కో ద‌శ‌కు వెళ‌నున్నారు. ఆ మేర‌కు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ప్ర‌క‌టించింది. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి(Jagan) జేఏపీ నేత‌లు నోటీసులు అంద‌చేశారు. ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్నట్టు నోటీసుల్లో పేర్కొంటూ మార్చి 9న కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని డెడ్ లైన్ పెట్టారు.

ప్ర‌భుత్వం మీద గ‌వ‌ర్న‌ర్ కు ఉద్యోగు సంఘం నేత‌లు  ఫిర్యాదు

ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు(AP Employees) ఈ ఉద్య‌మానికి న‌డుంబిగించారు. ఉద్యోగులంతా డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ నిరసనలకు దిగాల‌ని కోరారు. ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇచ్చేలా ప్లాన్ చేశారు.అప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాల్లోని విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : AP Employees : ఏపీ ఉద్యోగ సంఘం విజ‌యం! `సుప్రీం` దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ !

ఎన్జీవో సంఘాల నేత‌గా ఇటీవ‌ల బండి శ్రీనివాస‌రావు ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయి. అందుకే, గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చిన ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణ మీద ఫైర్ అయ్యారు. ఆ సంఘాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు, సూర్య‌నారాయ‌ణ ఆస్తుల మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో ఎన్డీవో , ప్ర‌భుత్వ గెజిటెడ్‌ ఉద్యోగుల(AP Employees) మ‌ధ్య వార్ షురూ అయింది. ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేసిన సూర్య‌నారాయ‌ణ వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌ని వైసీపీ చెబుతోంది. అదే, బండి శ్రీనివాస‌రావు కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ పుష్క‌లంగా ఉంద‌ని టీడీపీ భావిస్తోంది. ఇలా, రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ద్ధ‌తు దారులుగా ఉద్యోగ సంఘాల నేత‌లు విడిపోయారు. ఆ క్ర‌మంలో సీపీఎస్ మూల‌న ప‌డింది.

సీపీఎస్ ర‌ద్దు సాధ్యం కాద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

సీపీఎస్ ర‌ద్దు సాధ్యం కాద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) స‌ర్కార్ ఎప్పుడో తేల్చింది. కానీ, ఉద్యోగులు మాత్రం దాని ర‌ద్దుకు ప‌ట్టుబ‌డుతున్నారు. మంత్రుల ఉప సంఘం సూచించిన ప్ర‌త్యామ్నాయం జీపీఎస్ కు కూడా ఉద్యోగ సంఘాల నేత‌లు(AP Employees) అంగీక‌రించ‌డంలేదు. ప‌లు సంద‌ర్భాల్లో ఉద్యోగుల గొంతెమ్మ కోర్కెల‌ను తీర్చ‌లేమ‌ని మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఎన్ని కోర్కెలో తీర్చిన‌ప్ప‌టికీ ఇంకా ఉంటాయ‌ని కూడా వ్యంగ్యాస్త్రాల‌ను కూడా. సంధించారు. మ‌హా అయితే, కోర్టుకు వెళ‌తారు? అక్క‌డ ఏమ‌వుతుంది? అనేది ఉద్యోగుల‌కు తెలుసంగా హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఏక‌తాటిపైకి రాలేని ఉద్యోగ సంఘాల నేత‌ల వైఖ‌రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కు అందొచ్చిన అవ‌కాశం. ఇలాంటి ప‌రిస్థితుల్లో బొప్ప‌రాజు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నిర‌స‌న‌లు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఎంత వ‌ర‌కు జ‌రుగుతాయ‌నేది ప్ర‌శ్నార్థ‌కం.

Also Read : AP Employees : జీతాలిస్తే చాలు,ఇంకేమొద్దు! ఉద్యోగుల‌కు త‌త్త్వం బోధ‌ప‌డి.!

ఎన్నిక‌ల్లో ఉద్యోగుల(AP Employees) ప్ర‌మేయం పెద్ద‌గా లేకుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయ‌గ‌లిగారు. ఉపాధ్యాయుల‌ను ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. వాళ్ల స్థానంలో ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఎన్నిక‌ల‌కు ఉప‌యోగించాల‌ని ట్రైనింగ్ కు సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌భుత్వం ఉద్యోగుల్లో ఎలాగూ టీడీపీ, వైసీపీగా ఉన్నారు. ఇప్పుడు ఉద్య‌మానికి కాలుదువ్వుతున్న సంఘాల నేత‌ల భ‌ర‌తం ప‌ట్ట‌డానికి స‌ర్కార్ సిద్ధంగా ఉంది. ఆ దిశ‌గా పోలీసులు అడుగులు క‌నిపిస్తున్నాయి. ఆనాడు గౌత‌మ్ స‌వాంగ్ ఉన్న‌ప్పుడు ప‌రిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు లేవ‌ని గ్ర‌హించిన ఉద్యోగ సంఘాల నేత‌లు ఎంత వ‌ర‌కు ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ‌తారు? అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jagan) వ్యూహం మీద ఆధార‌ప‌డి ఉంది.