AP Elections 2024 : మార్చి 06 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..?

గత కొద్దీ నెలలుగా మార్చి , లేదా ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్నాయనే ప్రచారం నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 07:22 PM IST

తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Election Polling) సమయం దగ్గరికి వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 03 న విజయం ఎవర్ని వరిస్తుందో తెలిసిపోతుంది. ఆ తర్వాత ఎన్నికల సమరం ఏపీ (AP)లో మొదలుకాబోతుంది. గత కొద్దీ నెలలుగా మార్చి , లేదా ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్నాయనే ప్రచారం నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 06 ఎన్నికల పోలింగ్ జరగబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికే ఎన్నికల సంబదించిన ఏర్పాట్లు మొదలయ్యాయని..ఈవీఎంలు సైతం పలు జిల్లాలకు ఈసీ (EC) పంపించారనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 2 వ తేదీన ఎన్నికలకు సంబదించిన షెడ్యూల్ విడుదల చేయబోతున్నారని అంటున్నారు. మరి దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఏపీ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉన్నట్లు.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి ఏపీ ఎన్నికలు ఏ రేంజ్ లో ఉండబోతాయో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపీ విజయడంఖా మోగించగా..ఈసారి రిపీట్ చేస్తుందా..? లేక టీడీపీ (TDP) – జనసేన (Janasena) పొత్తు విజయం సాధిస్తుందా అనేది చూడాలి. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు కూడా వైసీపీ ఫ్యాన్ గాలి గట్టిగా వీచినప్పటికీ..చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా తగ్గింది. సొంత పార్టీ నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ వచ్చారు. ప్రజలు సైతం కక్ష్య పూర్తితంగానే బాబు ను జైలు లో వేశారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతు తెలుపడం..పొత్తు ఖరారు చేయడం..ఇరు పార్టీలు తమ కార్యాచరణ మొదలుపెట్టడం..ఇలా అన్ని చకచకా నడుస్తుండడం తో ప్రజల్లో టీడీపీ ఫై నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు బాబు కు బెయిల్ రావడం కూడా టీడీపీ పార్టీ కి బాగా ప్లస్ అయ్యింది. సో..రాబోయే ఎన్నికలు మరింత రంజుగా ఉండబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

Read Also : Rahul Gandhi : తెలంగాణలో దొరల పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే – రాహుల్