ఏపీలో ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలియజేసారు. మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా..జూన్ 04 న కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 18 నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25 , నామినేషన్ల స్కూటినీ- ఏప్రిల్ 26 , నామినేషన్ల విత్డ్రా కు ఏప్రిల్ 29 , ఎన్నికల పోలింగ్ వచ్చేసి – మే 13 , ఎన్నికల కౌంటింగ్- జూన్ 4 జరపనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.
లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ కు సంబదించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలియజేసారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసారు. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లున్నారని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని జనాభాను కలిపినా ఎక్కువన్నారు. ఇక దేశంలో ఎన్నికల కోసం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1.50 కోట్ల మంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు విధుల్లో పాల్గొంటారన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.
దేశంలో మొత్తం రూ.96.88 కోట్లు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు, యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు, తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు, దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు, 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82 లక్షలు, 100 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 2.18 లక్షలు, సర్వీస్ ఓటర్లు 19.1 లక్షలు, ట్రాన్స్ జెండర్లు 48,000 ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also : Lok Sabha Elections: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్