AP Election Results : కౌంటింగ్ ప్రారంభం

ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 61వేల 945 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వినియోగించుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Postel Votes Counting Start

Postel Votes Counting Start

ఏపీ ఎన్నికల పోలింగ్ తాలూకా కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 33 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సీట్ల కోసం 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 26,473 మంది ఓటర్లు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా ఓటు వేశారు. మరో 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేయడం జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ఫలితంతో రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అనేది తెలియనుంది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో మే 13 న జరిగిన పోలింగ్ లో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 61వేల 945 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును వినియోగించుకున్నారు. అలాగే హోమ్ ఓటింగ్ ద్వారా 26,473 మంది, సర్వీసు ఓటర్లు 26,721 మంది ఓట్లు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి E.V.M లెక్కింపునకు 2వేల443 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 443 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2వేల446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 557 టేబుళ్లను లెక్కింపునకు ఏర్పాటు చేశారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా 13 రౌండ్లు ఉన్న నర్సాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల ఫలితం ముందుగా వెలువడనుంది. అలాగే కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం 1 కల్లా వెల్లడయ్యే అవకాశముంది. ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున వెల్లడయ్యే అవకాశముంది. 111 నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకే వెలువడే అవకాశమున్నట్టు ఇప్పటికే ఈసీ స్పష్టం చేసింది.

Read Also : AP Election Results : పోస్టల్ బ్యాలెట్ తో ఎవరు విజయం సాదించబోతున్నారో తెలియబోతుందా..?

  Last Updated: 04 Jun 2024, 08:16 AM IST