ఏపీ నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది..అది కూడా సరిగ్గా ఎన్నికలు రెండు నెలల్లో ఉండనున్న క్రమంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏపీ సర్కార్ తన ఎన్నికల వ్యూహాన్ని బయటపెట్టింది. అధికారంలోకి వచ్చాక ప్రతీ సంవత్సరం మెగా డీఎస్సీ (Mega DSC) అంటూ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్న జగన్ (CM Jagan)..అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మరచిపోయారు. గత నాలుగేళ్లుగా డీఎస్సీపై ఊసెత్తని ప్రభుత్వం..ఇక ఇప్పుడు డీఎస్సీ ప్రకటన చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందులో 2,299 స్కూల్ అసిస్టెంట్, 2,280 SGT పోస్టులు , 1,264 టీజీటీ, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మార్చి 05 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగనున్నాయి.
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. ఏప్రిల్ 02న ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత.. ఏప్రిల్ 05 పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నట్టు మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. తమ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఈ సందర్బంగా తెలిపారు.
Read Also : 400 Paar Vs 40 Seats : ఖర్గే, మోడీ మధ్యలో దీదీ.. ‘400 పార్’ వర్సెస్ ‘40 సీట్లు’.. ప్రధాని కీలక వ్యాఖ్యలు