Site icon HashtagU Telugu

AP DGP : వినాయక చవితిపై ఎలాంటి ఆంక్షలు లేవు..!!

Ganesh

Ganesh

ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ…ఏపీ డీజీపీ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణపైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎలాంటి ఆంక్షలు లేవని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని…అలాంటి ప్రచారాన్ని ఎవరూ విశ్వసించద్దని కోరారు.