AP Deputy CM Pawan: పిల్లాడి కోసం కాన్వాయ్ ఆపిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌.. వీడియో వైర‌ల్‌!

AP Deputy CM Pawan: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. కూట‌మి ప్ర‌భుత్వంలో భాగంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎంగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM Pawan) బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్య‌త‌లు తీసుకున్న ప‌వ‌న్ త‌న స్టైల్‌లో ప‌రిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై అధికారుల‌తో సమీక్ష‌లు జ‌రుపుతున్నారు. అంతేకాకుండా ఆ శాఖ‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని లోతుగా తెలుసుకుంటున్నారు. అయితే ప్ర‌స్తుతం సినిమాల‌కు […]

Published By: HashtagU Telugu Desk
AP Deputy CM Pawan

AP Deputy CM Pawan

AP Deputy CM Pawan: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. కూట‌మి ప్ర‌భుత్వంలో భాగంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎంగా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM Pawan) బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్య‌త‌లు తీసుకున్న ప‌వ‌న్ త‌న స్టైల్‌లో ప‌రిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా త‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌పై అధికారుల‌తో సమీక్ష‌లు జ‌రుపుతున్నారు. అంతేకాకుండా ఆ శాఖ‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని లోతుగా తెలుసుకుంటున్నారు. అయితే ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్న జ‌న‌సేనాని కేవ‌లం రాజ‌కీయాల‌పైనే దృష్టిపెట్టాడు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీర్చే ప‌నిలో ఉన్నారు. అయితే ప‌వ‌న్‌కు సంబంధించిన తాజా వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read: Monsoon Skincare Tips: ఈ సీజ‌న్‌లో చ‌ర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే..!

అస‌లు విష‌యం ఏంటంటే.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్గ‌మ‌ధ్య‌లో ఓ చిన్నారి అభిమానిని ప‌ల‌క‌రించారు. ఉప్పాడ‌లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రోడ్డు మార్గంగా వెళ్తుంటే ఓ చిన్నారి రోడ్డు ప‌క్క‌నే జ‌న‌సేన జెండాతో రోడ్డుపై వెల్‌క‌మ్ చెబుతూ క‌నిపించాడు. ఇది గ‌మ‌నించిన జ‌న‌సేనాని వెంట‌నే ఆ చిన్నారి కోసం త‌న కాన్వాయ్‌ను ఆపి ఆ చిన్నారి ద‌గ్గ‌రికి వెళ్లి ఆప్యాయంగా ప‌ల‌కరించి ద‌గ్గ‌ర‌కు తీసుకున్నారు. అయితే ఇది గ‌మ‌నించిన సిబ్బంది ఆ చిన్నారిని ప‌క్కకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా ప‌వ‌న్ వారిని వ‌ద్ద‌ని వారించారు. ప్ర‌స్తుతం ఈ వీడియోను జ‌న‌సైనికులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనసైనికులు తమ నాయకుడు మంచి మనసున్న నేత అంటూ ఉప్పొంగిపోతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఈ వీడియోపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. ప‌వ‌న్ లాంటి నాయ‌కుడు చాలా అరుదు అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక‌పోతే ప‌వ‌న్ పిఠాపురం నుంచి 70వేల పైచిలుకు ఓట్ల‌తో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌పై గెలిచిన విష‌యం తెలిసిందే.

  Last Updated: 03 Jul 2024, 01:13 PM IST