Site icon HashtagU Telugu

Pawan Kalyan : కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ..

Pawan's Warning To Party Ml

Pawan's Warning To Party Ml

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) జులై 1 నుండి మూడు రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ చేసారు. జులై 01 న కాకినాడ వెళ్లనున్నారు.. అక్కడి నుంచి గొల్లప్రోలు వెళ్లి అక్కడ పింఛన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మొత్తం రూ. 7 వేలు పెన్షన్‌ను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రారంభించి పరిశీలించనున్నారు. అనంతరం పిఠాపురంలో పర్యటిస్తారు. అక్కడి జనసేన నేతలతో సమావేశమై నియోజవర్గ సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జులై 02 న కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో పవన్ సమావేశం నిర్వహించనున్నారు. పలు కీలక సూచనలు చేయనున్నారు. అదే రోజు అక్కడే బస చేసి జులై 3న ఉప్పాడకు వెళ్లనున్నారు. ఉప్పాడ బీచ్ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడ వచ్చే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే భద్రత విషయంలోనూ వెనక్కి తగ్గొద్దని , బీచ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించే అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన నేపథ్యంలో అధికారులు, ఇటు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు.

ఈరోజు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఉదయం మాదాపూర్ నుండి రోడ్డు మార్గాన వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ప్రజలు, అభిమానులు నీరాజనాలు పలికారు. పవన్‌కు పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఎన్నికల ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్ పూజలు నిర్వహించారు. పవన్ పర్యటన దృష్ట్యా కొండగట్టు అంజన్న క్షేత్రంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read Also : D Srinivas : డీఎస్ చివరి కోరిక నెరవేర్చిన టీపీసీసీ నేతలు