Site icon HashtagU Telugu

Pawan Kalyan Tweet: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచ‌ల‌న ట్వీట్‌

Pawan Kalyan Tweet

Pawan Kalyan Tweet

Pawan Kalyan Tweet: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అనేక అక్ర‌మాల‌పై ఉక్కుపాదం మోపుతోంది. సోష‌ల్ మీడియా, డ్ర‌గ్స్‌, గంజాయిలాంటి విష‌యాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో గంజాయి, డ్ర‌గ్స్ వంటి వాటిని అరికట్ట‌డానికి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక‌పోతే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై డ్ర‌గ్స్ విష‌యంపై ఓ సంచ‌ల‌న ట్వీట్ (Pawan Kalyan Tweet) చేశారు.

విశాఖ డ్రగ్ కంటైనర్ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌కు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రానికి డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. గత ప్రభుత్వ అవినీతి నుంచి ఎన్డీయే కూటమికి సంక్రమించిన వారసత్వ సమస్య ఇది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా విజయవాడతో లింకులు ఉంటున్నాయి. నేరస్తులపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర కార్యాచరణ అవసరం ఉంది’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: CM Chandrababu: ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ చివరి దశకు.. ఎప్పుడంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ ఇదే

రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది. మన NDA ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక సమస్య. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి. కొంతకాలం క్రితం విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని చూపిస్తుంది. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అని ఆయ‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. మ‌రోవైపు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై, అరెస్ట్‌ల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ డీజీపీ తిరుమ‌ల‌రావుతో భేటీ అయిన‌ట్లు తెలుస్తోంది.