Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan To Take Charge

Pawan Kalyan To Take Charge

విజయవాడ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం (AP Deputy CM )గా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మధ్యాహ్నం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1,2 అధికారులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12:30కి పంచాయతీ రాజ్ సెక్రటరీ అసోసియేషన్ తో సమావేశం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక నిన్న విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను పవన్ పరిశీలించారు. పవన్‌.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్‌ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో సీఎం చంద్రబాబు సైతం పవన్ కు అభినందనలు తెలిపారు. ఇద్దరు దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబదించిన పలు అంశాలపై చర్చించుకున్నారు.

Read Also : Flying School: ఎయిరిండియా కీలక నిర్ణయం.. మహారాష్ట్రలో సొంతంగా ఫ్లయింగ్‌ స్కూల్‌

  Last Updated: 19 Jun 2024, 11:21 AM IST