AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ప్రధాన ఎజెండాగా మారింది.

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ప్రధానంగా ఎన్డీయే, వైసీపీ మధ్య రసవత్తర పోరు కొనసాగుతుంది. ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు వివేకా హత్య కేసుపై పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కడప కోర్టు.. ప్రతిపక్ష నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్యపై ఎవరూ మాట్లాడకూదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్డీయే కూటమి వివేకా హత్యను ప్రస్తావిస్తూ అధికార పార్టీ వైసీపీపై ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోకసభ స్థానానికి పోటీ చేస్తున్నారు. మారోవైపు వైఎస్‌ఆర్‌సీపీ కడప లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో వివేకా కేసుని షర్మిల పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీసీసీ అధినేత్రి వైఎస్‌ షర్మిల, సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు డీ పురంధేశ్వరితో పాటు ఆయా రాజకీయ పార్టీల అనుచరులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి శ్రీదేవి ఏప్రిల్ 16న స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsAppClick to Join

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి 2019 మార్చిలో కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.ప్రస్తుత కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు, ఈ కేసులో తన తండ్రికి న్యాయం చేయాలనీ వివేకా కుమార్తె సునీత పోరాటం చేస్తున్నారు. మొత్తంగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార అంశంగా మారింది.

Also Read: Eye Cancer: దేశంలో క్యాన్స‌ర్‌ ముప్పు.. కొత్త‌గా కంటి క్యాన్స‌ర్, ల‌క్ష‌ణాలివే..!