వైసీపీ సర్కార్ కు వరుస తలనొప్పులు ఎదురువుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాలు అధికార పార్టీ వైసీసీ లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ ఉద్యోగులు వారి సమస్యలు పరిష్కలించాలని ప్రభుత్వం ఫై ఒత్తిడి తెస్తున్నారు. ఆనాడు పాదయాత్ర లో పలు హామీలు కురిపించారని..అలాగే ఎన్నికల ప్రచారంలో మరికొన్ని హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేశారని కాంట్రాక్టు ఉద్యోగులు , అవుట్ సోర్స్ ఉద్యోగులు ఆరోపణలు చేస్తూ..ఆందోళనకు దిగారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి వారికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గత 15 రోజులుగా అంగన్వాడీ లు సమ్మె కారణంగా సెంటర్స్ అన్ని మూత పడిపోయాయి. ఇక మున్సిపల్ కార్మికులు కూడా వారికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంగళవారం నుండి సమ్మె ప్రారంభిస్తున్నారు. వారికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి సమ్మె నోటీసును కూడా అందచేశారు. ఇలా ఒక్కొక్కరుగా సమస్యల పరిష్కరించాలని రోడ్లపైకి వస్తుండటం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఎన్నికల కాలంలో ఇది ఎటు దారి తీస్తుందో అన్న కంగారు మాత్రం వారిలో కనిపిస్తోంది.
Read Also : Malavika Mohanan : ఎరుపు రంగు దుస్తులలో వేడిని పెంచుతున్న మాళవిక మోహనన్