కాంగ్రెస్ పార్టీ ‘సేవ్ ద నేషన్-సేవ్ డెమోక్రసీ’ అనే ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించిందని ఇదే నినాదంతో ఎన్నికలకు వెళుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో రుద్రరాజు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వారి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘సేవ్ ద నేషన్ – సేవ్ డెమోక్రసీ’ పోస్టర్లను పీసీసీ చీఫ్ రుద్రరాజు విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్నిఈ బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తుందని పీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు. రేపటి (అక్టోబరు 4) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వరుస బహిరంగ సభలు నిర్వహించనున్నామని, మొదటి బహిరంగ సభ చిత్తూరులో, రెండో సభ అక్టోబర్ 5న మదనపల్లెలో, మూడో సభ అక్టోబర్ 5న కడపలో నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.