Site icon HashtagU Telugu

AP Congress MP 3rd List : ఏపీ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

Congress Boycott Exit Poll

Telangana Congress MPs dharna in Delhi

కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంఖా మోగించగా..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టాలని చూస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో భాగంగా అభ్యర్థుల తాలూకా మూడో జాబితా విడుదల చేసింది. ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో పాటుగా ఏపీలోని 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ జాబితా రిలీజ్ చేసింది. ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉండగా.. మొదటి జాబితాలో 5 స్థానాలు, రెండో జాబితాలో 6 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మూడో జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ఇక తాజాగా ప్రకటించిన 09 అభ్యర్థులు (Congress MP 3rd List) ఎవరా అనేది చూస్తే..

శ్రీకాకుళం – పి పరమేశ్వరరావు
విజయనగరం – బొబ్బిలి శ్రీను
అమలాపురం (ఎస్సీ) – జంగా గౌతం
మచిలీపట్నం – గొల్లు కృష్ణ
విజయవాడ – వళ్లూరు భార్గవ్
ఒంగోలు – సుధాకర రెడ్డి
నంద్యాల – జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్
అనంతపురం – మల్లికార్జున్ వజ్జల
హిందూపురం – బీఏ సమద్ షాహీన్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది.

Read Also : Raj Tarun : జీవితంలో పెళ్లి చేసుకోను అంటున్న రాజ్ తరుణ్.. వాళ్ళ అమ్మానాన్నలు..