Site icon HashtagU Telugu

AP Congress : ఓ వైపు షర్మిల.. మరోవైపు పల్లం రాజు.. ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్‌ రెడీ

Ap Congress

Ap Congress

AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది. ఈవిషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ కమిటీలో సభ్యులుగా కనుమూరి బాపిరాజు, జేడీ శీలం, తులసిరెడ్డి, కమలమ్మ, జంగా గౌతం, ఉషానాయుడు, నజీరుద్దీన్‌, కొరివి వినయ్‌కుమార్‌, గంగాధర్‌, కారుమంచి రమాదేవిలను నియమించారు. కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్(AP Congress)  లోక్‌సభ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలిసింది. కొన్ని ముఖ్యమైన స్థానాలకు సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు సమాచారం. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టేలోగానే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ అధినాయకత్వం ఉంది. రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌తో చేతులు కలిపే ఛాన్స్ ఉంది. ఒకవేళ బీజేపీతో టీడీపీ కలిస్తేనే..ఈ అవకాశం ఉండొచ్చు. లేదంటే వామపక్షాలు టీడీపీతో జతకట్టినా ఆశ్చర్యం ఉండదు.కమ్యూనిస్టులు తప్ప మరే పార్టీ కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఇప్పటి నుంచే పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి ప్రజలను కలుసుకుంటూ వెళితే కొంత మేర అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అందుకోసమే సీనియర్ నేతల పేర్లను అనధికారికంగా ఖరారు చేసినట్లు తెలిసింది.

Also Read: Junior NTR Vs TDP : వేటాడి వేటాడి మీ పతనం చూస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ లెటర్

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీ శీలం, తిరుపతి నియోజకవర్గం నుంచి చింతా మోహన్, నరసాపురం నియోజకవర్గం నుంచి కనుమూరి బాపిరాజు, కాకినాడ నియోజకవర్గం నుంచి పల్లంరాజు, విశాఖపట్నం నుంచి టి. సుబ్బిరామిరెడ్డి, కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని చెబుతున్నారు. వీరికి ఇప్పటికే సమాచారం అందడంతో వారు నియోజకవర్గాల్లో పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గెలుపోటములు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటనలు ఉండాలని ఏఐసీసీ నుంచి నేతలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల్లో కొంత పట్టును సాధించగలిగితే తర్వాత అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నిక వ్యవహారాన్ని చూడొచ్చని భావిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ ప్రజలకు ప్రచారంలో చెప్పనున్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు అభివృద్ధి నిధులతో పాటు రాష్ట్ర విభజనలోని అంశాలన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వనున్నారు. రాహుల్ గాంధీ కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో పర్యటించేందుకు ఓకే చెప్పారట. ప్రియాంక గాంధీ కూడా అనేక నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొనేలా ప్లాన్ చేశారట.