బీజేపీ అంటే B (బాబు) J(జగన్) P(పవన్) అని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ ముగ్గురు ఒక్కటేనంటూ ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల పై ప్రభుత్వ తీరు సరైంది కాదని.. మ్యానిఫెస్టోలో లో ఉన్నదే అమలు చేయమని బాధితులు అడుగుతున్నారని ఆయన తెలిపారు. అధికారం లోకి వచ్చిన మూడు నెలలలో సమస్య పరిష్కారం చేస్తాను సీఎం జగన్ హామీ ఇచ్చారని.. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అగ్రిగోల్డ్ విషయం లో మేనిఫెస్టో ఒక చిత్తు కాగితం అని రుజువు చేశారని.. 10 లక్షల మందికి బాధితులకు 3000 కోట్లు ఇవ్వాల్సి ఉందని తులసిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో 0.4 శాతం కేటాయిస్తే ఈ సమస్య ఇప్పటికే పరిష్కారం అయ్యేదని.. అగ్రిగోల్డ్ భాదితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే చాలు వైసీపీని గద్దె దింపవచ్చన్నారు. పొత్తులపై పవన్ చెప్పింది కొత్త విషయం కాదని ఆయన గతంలోనే చెప్పారని అన్నారు ఓటు చీలకూడదు అన్నది పవన్ ఉద్దేశమని.. ఏపీ అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా రావాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే హోదా సాధ్యమని.. టీడీపీ, వైసీపీ, జనసేన వీరిలో ఎవరికి ఓటు వేసిన బీజేపీ కి ఓటు వేసినట్లేనన్నారు.వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని తులసిరెడ్డి ఆరోపించారు.
Andhra Pradesh : బీజేపీకి కొత్త అర్థం చెప్పిన ఏపీ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి

Tulasi Reddy